దేశంలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. ప్రభుత్వం కఠిన నియమ నిబంధనలు అమలుపరుస్తున్నా కూడా కరోనాను కట్టడి చేయలేకపోతోన్నారు. ఇప్పుడు వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడతో ఎంత ఆర్భాటం ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి అంటే ఆకాశమంతా పందిరి అనే మాటలు ఇప్పుడు వినిపించవు. కరోనా దెబ్బకు పెళ్లిళ్ల రూపు రేఖలే మారిపోతోన్నాయి. తక్కువ సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారు. అలా పెళ్లిళ్లు గుట్టుచప్పుడు కాకుండా చేసేసుకుంటున్నారు.
కాగా పెండ్లి వేడుకల్లో వధువరూలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఇదిలా ఉండగా పెళ్లిలో వధువుతో వరుడి కాళ్లు మొక్కించడం తెలిసిన విషయమే.. తాళి కట్టినప్పుడు, అక్షింతలు వేసినప్పుడు, గౌరీ పూజ జరిగేటప్పుడు ఇలా చాలా సార్లు వధువు చేత వరుడి కాళ్లకు దండం పెట్టిస్తారు. కానీ తాజాగా ఓ పెండ్లి వేడుకలో మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా వరుడే వధువు కాళ్లపైపడి దండం పెట్టాడు. వివాహ తంతు పూర్తయ్యి పెండ్లి కొడుకు, పెండ్లి కూతరు దండలు మార్చుకుంటున్న సమయంలో పెండ్లి కొడుకు అకస్మాత్తుగా పెండ్లి కూతురు కాళ్లపై పడ్డాడు.
ఈ అనూహ్య పరిణామానికి ఫంక్షన్‌కు హాజరైన బంధు మిత్రులంతా ఆశ్యర్చపోయారు. అయితే అతడు ఇలా చేయడానికి ఓ కారణం ఉందంట.. తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నది కాబట్టి ఆమె కాళ్లకు దండం పెట్టడం తన బాధ్యత అన్నాడు. తనను కన్నవాళ్లను, తోబుట్టువులను వదిలి నాకోసం, తన సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆమె కాళ్లకు దండం పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించాడు. ప్రస్తుతం వరుడు వధువు కాళ్లపైపడ్డ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్‌ల నుంచి లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తున్నది.
చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్‌వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment