ఓ వైపు పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు చుట్టాలతో ఇళ్లంతా సందడిగా ఉంది. ఓ వైపు బ్యాండ్ బాజా మోగుతోంది. ఇంతలో అలజడి మొదలైంది. ఇదేం పద్ధతి అంటూ కేకలు మొదలయ్యాయి. చుట్టూ చుట్టాలు మూగే సమయానికి పెళ్లి వద్దని వధువు తెగేసి చెప్పింది.
లక్నో: మరికొద్ది గంటల్లో పూర్తి కావాల్సిన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. వివాహ వేడుక వద్ద వరుడి తరపున బంధువులు జరిపిన కాల్పుల్లో వధువు మామ గాయపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. దీంతో పెళ్లి కొడుకు బంధువుల ప్రవర్తనకు విస్మయం చెందిన వధువు పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. వధువు తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత పెళ్లి కూరుతు తరపున బంధువులు వరుడి కుటుంబం పై దాడి చేసి, కారును పగలగొట్టి అతని బంధువులను బందించారు. దీంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనపై వధువు ఇరామ్ స్పందిస్తూ.. ‘‘ నా కుటుంబం మొత్తం ఉన్నప్పుడే.. వాళ్ల కుంటుంబ ఈ విధంగా ప్రవర్తిస్తే.. ఇక నేను వాళ్ల ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు?’’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పులు జరిపిన వారిని గుర్తించడానికి పెళ్లి వేడుక వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు ఖార్ఖోడా పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర పలావత్ తెలిపారు. వరుడు షాజాద్ అతని సోదరుడు పప్పు, సానుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైసెన్స్ కలిగి ఉన్న ఆయుధం నుంచి బుల్లెట్ పేలితే, ఆయుధ లైసెన్స్ రద్దుకు నివేదిక పంపిస్తారని తెలిపారు. ఇక గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment