నాగభూషణం(ఫైల్)
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): వివాహ సందడి ఇంకా ముగియలేదు. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఇంకా వారి ఇళ్లకు చేరుకోలేదు. అంతలోనే ఆ ఇంట పెనువిషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో గాని వివాహం జరిగి మూడు రోజులు గడవకుండానే పెళ్లి కొడుకు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన రాజవొమ్మంగి మండలం బోర్నగూడెంలో సోమవారం జరిగింది. జడ్డంగి ఎస్‌ఐ షరీఫ్ అందజేసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలెం నాగభూషణం (30) అదే గ్రామంలో ఇంటికి కొంత దూరంలో ఏటిగట్టుపై ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు.
గ్రామస్తులు కొంత మంది చూసి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. ఈనెల 17న మండలంలోని సింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పెద్దల నిశ్చయం ప్రకారం ఓ ఆలయంలో నాగభూషణం వివాహం చేసుకున్నాడు. సోమవారం బహిర్భూమికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి ఎదురుగా ఉన్న కాలువవైపు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
చదవండి: వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు
పెళ్లి కుమారుడు పెద్ద తండ్రి దాసరి ఏసుబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమారా్టనికి అడ్డతీగల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని స్థానిక సీఐ రవికుమార్ సందర్శించి, ఆరా తీశారు. వీఆర్వో నాగేశ్వరరావు తదితరుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment