90-Year-Old Soudi Arabia Man Married For Fifth Time - Sakshi
Sakshi News home page

‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్‌మెంట్‌

Published Mon, Jul 17 2023 1:22 PM | Last Updated on Mon, Jul 17 2023 1:29 PM

saudi arabia oldest groom married for the fifth time - Sakshi

సౌదీ అరబ్‌ మీడియాలో 90 ఏళ్ల వృద్ధుని వివాహం హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ 90 ఏళ్ల వృద్ధుడు తాజాగా ఐదవ వివాహం చేసుకుని, సౌదీ అరబ్‌లో అత్యధిక వయసు కలిగిన వరునిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధుడు తన ఐదవ భార్యతో హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తూ, భవిష్యత్‌లోనూ ఇలానే మరిన్ని పెళ్లిళ్ఘు చేసుకుంటానని చెబుతున్నాడు. 

గల్ఫ్‌న్యూస్‌కు చెందిన ఒక రిపోర్టు ప్రకారం నాదిర్‌ బిన్‌ దహైమ్‌ వాహక్‌ అల్‌ ముర్షీదీ అల్‌ ఓతాబీ తాజాగా సౌదీలోని అఫీస్‌ ప్రాంతంలో తన ఐదవ వివాహం చేసుకున్నాడు. సోషల్‌ మీడియాలో ఈ వృద్ధ పెళ్లికొడుకుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతిథుల ఆ వృద్ధ వరునికి ఐదవపెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ వృద్ధ వరుడు అపరిమితమైన ఆనందంతో ఉప్పొంగిపోతూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో ఒక మనుమడు తన తాతకు వివాహ శుభాకాంక్షలు తెలియజేయడం కనిపిస్తుంది. 

సౌదీకి చెందిన ఈ వృద్ధ పెళ్లికొడుకు అరేబియా టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అవివాహితులంతా తప్పకుండా వివాహం చేసుకోవాలనే సందేశాన్నిచ్చాడు. ఈ పెళ్లి తరువాత కూడా మరో పెళ్లి చేసుకుంటానని అన్నాడు. వైవాహిక జీవితం ఎంతో శక్తివంతమైనదని, పెళ్లి చేసుకోవడంవలన జీవితంలో ప్రశాంతత దొరుకుతుందని అన్నారు. తన దీర్ఘాయుష్షకు కారణం తాను చేసుకున్న పెళ్లిళ్లేనని తెలిపాడు. 
 

ఇది కూడా చదవండి: ప్రియునితో ఉండగా పిన్నికి దొరికిపోయింది.. కంగారులో బ్రిడ్జిపై నుంచి దూకేసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement