ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లాడిన వ్యక్తి.. కారణం ఏం చెప్పాడో తెలుసా? | I Love Them Both: Jharkhand Groom Marries 2 Women In 1 ceremony | Sakshi
Sakshi News home page

ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లాడిన వ్యక్తి.. కారణం ఏం చెప్పాడో తెలుసా?

Published Tue, Jun 21 2022 9:24 PM | Last Updated on Tue, Jun 21 2022 9:41 PM

I Love Them Both: Jharkhand Groom Marries 2 Women In 1 ceremony - Sakshi

రాంచీ: ఓ వ్యక్తి ఒకేసారి ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నాడు. అంతేగాక ఈ పెళ్లి ముగ్గురి ఏకాభిప్రాయంతో జరగడం విశేషం. ఈ ఆశ్చర్యకర ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాలు..లోహర్‌దగాలోని భాంద్రా బ్లాక్‌లోని బండా గ్రామానికి చెందిన సందీప్‌, కుసుమ్‌ లక్రా అనే యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ముందే వీరికి ఒక బిడ్డ కూడా జన్మించింది. అయితే ఏడాది క్రితం సందీప్‌ ఇటుక బట్టీలో పనిచేసేందుకు  పశ్చిమబెంగాల్‌కు వలస వెళ్లాడు.

దీంతో వీరి ప్రేమకథ మరో ములుపు తిరిగింది. అక్కడ పనిచేయడానికి వచ్చి స్వాతి కుమారితో సందీప్‌కు పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఎవరి ఇంటికి వారు తిరిగి వెళ్లిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగాయి. ఈ విషయాన్ని చివరికి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల వద్దకు పంచాయితీకి తీసుకువెళ్లారు. అనేక గొడవలు, వాగ్వాదాలు తరువాత సందీప్‌కు ఇద్దరినీ ఇచ్చి పెళ్లి చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. యువతులిద్దరూ, కుటుంబ సభ్యులు కూడా అడ్డు చెప్పకపోవడంతో ఇద్దరి మెడలో తాళి కట్టి భార్యలుగా స్వీకరించాడు.
చదవండి: తప్పతాగి రెచ్చిపోయిన యువతి.. నడిరోడ్డుపై పోలీస్ కాలర్ పట్టుకొని..

పెళ్లి తర్వాత, సందీప్ ఇండియా మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు మహిళలను కలిసి వివాహం చేసుకోవడం ద్వారా చట్టపరమైన సమస్య ఉండవచ్చు.. కానీ నేను వారిద్దరినీ ప్రేమిస్తున్నానని, ఇద్దరినీ విడిచి పెట్టి ఉండలేనని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement