![Pakistani Groom Gifts Framed Picture Of Former PM Imran Khan To Bride.](/styles/webp/s3/article_images/2024/05/2/pak1.jpg.webp?itok=3y_MWRXz)
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరిగే గొప్ప ఘట్టం. అది అందరికి ఓ మర్చిపోని గొప్ప మధురానుభూతి. అలాంటి గొప్ప క్షణాన్ని పదిలంగా ఉంచుకునేలా కొందరూ బహుమతులు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓ వరుడు అలానే ఓ బహుమతిని వధువకి ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూసిన వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోయారు. చెప్పాలంటే అది ఊహకే అందని బహుతి అది. ఇంతకీ ఆ వధువుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..
ఈ అరుదైన ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. పెండ్లి రోజున పాకిస్తానీ వరుడు తన కాబోయే భార్యకు ఓ విచిత్రమైన గిఫ్ట్‌ని అందజేశాడు. ఆమె ఆనందంగా ఆ గిప్ట్ ఏంటని తెరిచి చూసి ఒక్కసారిగి నివ్వెరపోయింది. అది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో. తాను ఊహించని ఆ బహుమతిని చూసి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఫోటోలకి ఆనందంగా ఫోచ్చింది.
ఆ వేదిక వద్ద ఉన్న అతిథులు సైతం ఆ ఫోటో ఫ్రైమ్‌ని చూసి ఆశ్చర్యపోతు వారిపై పూల వర్షం కురిపించిగా..ఆ వధువరులిద్దరు ఆ ఫోటో ప్రేమ్‌ని కలిసి పట్టుకుని ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసి నెటిజన్లు విమర్శలు కురిపించగా, మరికొంందరూ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ విడిపించేందుకు పాక్‌లోని కొందరు ప్రజలు చేస్తున్న ఎత్తుగడ అని కామెంట్లు చేశారు.
కాగా, 2018 నుంచి 2022 వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు గానూ అతనికి, ఇమ్రాన్ భార్యకు 14 సంవత్సరాల జైలు శిక్షతో సహా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
Becoming a common occurrence now. How long before they put a ban on this? pic.twitter.com/c0BJHjTdkQ
— Mahvish- (@halfbakedtruths) April 30, 2024
(చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment