Photo frame
-
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరిగే గొప్ప ఘట్టం. అది అందరికి ఓ మర్చిపోని గొప్ప మధురానుభూతి. అలాంటి గొప్ప క్షణాన్ని పదిలంగా ఉంచుకునేలా కొందరూ బహుమతులు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓ వరుడు అలానే ఓ బహుమతిని వధువకి ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూసిన వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోయారు. చెప్పాలంటే అది ఊహకే అందని బహుతి అది. ఇంతకీ ఆ వధువుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..ఈ అరుదైన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. పెండ్లి రోజున పాకిస్తానీ వరుడు తన కాబోయే భార్యకు ఓ విచిత్రమైన గిఫ్ట్‌ని అందజేశాడు. ఆమె ఆనందంగా ఆ గిప్ట్ ఏంటని తెరిచి చూసి ఒక్కసారిగి నివ్వెరపోయింది. అది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో. తాను ఊహించని ఆ బహుమతిని చూసి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఫోటోలకి ఆనందంగా ఫోచ్చింది. ఆ వేదిక వద్ద ఉన్న అతిథులు సైతం ఆ ఫోటో ఫ్రైమ్ని చూసి ఆశ్చర్యపోతు వారిపై పూల వర్షం కురిపించిగా..ఆ వధువరులిద్దరు ఆ ఫోటో ప్రేమ్‌ని కలిసి పట్టుకుని ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసి నెటిజన్లు విమర్శలు కురిపించగా, మరికొంందరూ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ విడిపించేందుకు పాక్‌లోని కొందరు ప్రజలు చేస్తున్న ఎత్తుగడ అని కామెంట్లు చేశారు. కాగా, 2018 నుంచి 2022 వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు గానూ అతనికి, ఇమ్రాన్ భార్యకు 14 సంవత్సరాల జైలు శిక్షతో సహా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Becoming a common occurrence now. How long before they put a ban on this? pic.twitter.com/c0BJHjTdkQ— Mahvish- (@halfbakedtruths) April 30, 2024 (చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
తిరుపతిలో లావణ్య ఫోటో ఫ్రేమ్స్ షాపులో భారీగా మంటలు..!
-
వైఎస్ భారతికి చిత్రపటం బహూకరణ
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి.. సాక్షి దినపత్రిక, టీవీ, భారతి గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతికి ఆమె చిత్రాన్ని ప్రొద్దుటూరుకు చెందిన సేవ్‌గర్ల్ చైల్డ్ ప్రాజెక్టు అధ్యక్షుడు తుపాకుల రామాంజనేయరెడ్డి అందించారు. గురువారం పులివెందులలో వైఎస్ భారతిని రామాంజనేయరెడ్డి కలిశారు. సేవ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్టులో భాగంగా తాము చేపట్టిన చైతన్య కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్టిస్టు కుమారి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చదవండి: (YSR Kadapa: వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం) -
ఫోటో ఫ్రేమ్స్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్సిళ్లు
-
ఫ్రేమ్ ఆర్ట్ ఇన్స్టాలేషన్.. తాడే గట్టుకు చేర్చే లిఫ్ట్
హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లాహౌల్ స్పితిలో వరదలు సంభవించాయి. వరదల కారణంగా జహ్మాలా కాలువకు ఒకవైపు చిక్కుకుపోయిన వారిని తాళ్ల ద్వారా మరో వైపుకు చేరుస్తున్న దృశ్యం చూడ్డానికి ఫ్రేమ్‌లో ఉన్న బొమ్మలా కనిపిస్తున్న ఈ దృశ్యం జర్మనీలోని ఓ పార్కులో తీసింది. పార్కులోని సోయగాలను మరింత అందంగా చూపేందుకు ఫ్రేమ్ ఆర్ట్ ఇన్స్టాలేషన్ చేశారు. దీంతో ఫ్రేమ్ వెనుక ఉన్న ప్రాంతమంతా త్రీడీ చిత్రంలా కనిపిస్తుంది. నాసా వ్యోమగాములతో చంద్రునిపైకి వెళ్లే మొదటి స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ హ్యూమన్ ల్యాండర్ డిజైన్ చిత్రమిది. స్పేస్ఎక్స్ దీనిని విడుదల చేసింది. ఆర్టెమిస్ ప్రోగ్రాం కింద నాసా ప్రకటించిన 20 వేల కోట్ల కాంట్రాక్టును జెఫ్ బెజోస్‌కు చెందిన సంస్థను కాదని ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌కు అప్పగించినట్లు అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ కార్యాలయం ప్రకటించింది. -
కేటీఆర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతుల పంచలోహ చిత్రపటాన్ని కేటీఆర్‌కు.. శ్రీనివాస్‌గౌడ్, తన కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితతో కలిసి బహూకరించారు. ప్రముఖ శిల్పులు మూణ్ణెళ్ల పాటు కృషిచేసి దీన్ని రూపొందించినట్లు శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దంపతుల పంచలోహ చిత్ర పటంను రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ @KTRTRS గారి పుట్టినరోజు సందర్భంగా కుమార్తెలు శ్రీ శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహిత, శ్రీ హర్షిత లతో కలిసి బహుకరించడం జరిగింది. pic.twitter.com/5rIRGx0B3m — V Srinivas Goud (@VSrinivasGoud) July 27, 2021 -
పీల్.. ప్లీ
ఓ గృహిణి.. ఖాళీ టైమ్‌లో ఫొటో ఫ్రేమ్‌లు తయారు చేస్తూ ఇంట్లో అలంకరిస్తారు. పరిచయస్తులకు, బంధువులకు ఇస్తుంటారు. ఓ కాలేజీ స్టూడెంట్.. పాత సీడీల వంటి ‘ఈ వేస్ట్’తో వెరైటీ గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేస్తాడు. ఇంట్లో పెట్టుకున్నవి మినహా మిగిలినవి అందరికీ ఇచ్చేస్తుంటాడు. వీళ్లిద్దరూ తమ హస్తకళలు బాగున్నాయనే పొగడ్తలు అందుకుంటారు. మరి.. సేల్స్ చేయవచ్చు కదా..! అంటే అమ్మో.. మన దగ్గర షాప్ పెట్టేంత కేపిటల్ ఎక్కడ? ఊరికే ఇస్తున్నాం కాబట్టి గానీ అమ్మితే ఎవరైనా కొంటారా? అనేస్తారు. అయితే ఆ గృహిణి, స్టూడెంట్ ఇక అలాంటి అనుమానాలు లేకుండా, పెద్ద పెట్టుబడి అవసరం లేకుండా తమ వస్తువులను అమ్ముకోవచ్చు. అదెలా అంటారా.. అదే ఫ్లీ మార్కెట్. బంజారాహిల్స్‌లో ఒక పెద్ద హోర్డింగ్. అందులో ఏముందంటే.. ‘ఈ నెల 11న అతి పెద్ద ఫ్లీ మార్కెట్‌ను అవర్ ప్లేస్ హోటల్లో నిర్వహిస్తున్నాం సంప్రదించండి’ అని. చాలామంది దాన్ని యథాలాపంగా చూసి వెళ్లిపోవచ్చు. కానీ దాని గురించి తెలిసిన కొందరు మాత్రం.. తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్‌గా గుర్తిస్తారు. ‘మేం అవర్ప్లేస్లో పెట్టిన ఫ్లీ మార్కెట్‌కు అంత పబ్లిసిటీ ఇవ్వడానికి కారణం అవి ఉపయోగపడాల్సిన వాళ్లకి ఉపయోగపడాలనే’ అంటారు సదరు మార్కెట్ నిర్వాహకురాలు శశినెహతా. ఏమిటీ ఫ్లీ మార్కెట్.. విదేశాల్లో ఇంట్లో నిరుపయోగంగా ఉన్న సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం కోసం ప్రత్యేకంగా దీన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. అవిప్పుడు ప్రపంచవ్యాప్త ట్రెండ్‌గా మారి రకరకాలుగా తమ పరిధిని విస్తరించుకున్నాయి. దీనిలో ఎవరైనా, ఎలాంటి ఉత్పత్తితో అయినా పాల్గొనవచ్చు. అయితే ఈ ఉత్పత్తులు తయారు చేసిన వారికి ఎటువంటి స్టోర్స్ గానీ మరే మార్కెటింగ్ సాధనం గానీ ఉండకూడదు. ఆన్లైన్ స్టోర్స్ ఉంటే ఫర్వాలేదు. ఈ తరహా ఫ్లీ మార్కెట్లను నగరంలో కొందరు ఆర్గనైజ్ చేస్తూ నామమాత్రపు రుసుం వసూలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని లామకాన్, సప్తపర్ణి, సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్.. ఇలా పలు చోట్ల ఈ మార్కెట్లు అన్నీ వారాంతాల్లోనే నిర్వహిస్తుండడం వల్ల అటు వినియోగదారులకు, ఇటు పార్ట్‌టైమ్ వ్యాపారవేత్తలకు వెసులుబాటుగా ఉంటోంది. ‘గత ఆర్నెల్లుగా ఈ ఫ్లీ మార్కెట్ల నిర్వహణకు యువత బాగా ముందుకు వస్తున్నారు’ అని చెప్పారు సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్ నిర్వాహకురాలు నయనతార. తమ దగ్గరకు ఫ్లీ మార్కెట్ నిర్వహిస్తామంటూ వచ్చేవారు బాగా పెరిగారని, అయితే తమ పరిమితుల దృష్ట్యా నెలకు ఒకసారి మాత్రమే వీటిని అనుమతిస్తున్నామన్నారు. ‘యువత క్రియేటి వ్ వర్క్ చేస్తున్నారు. ఇలా ఒక చోటుకి రావడం మంచి అవకాశం మార్కెట్లో అందుబాటులో లేనివి, ఎన్నడూ చూడని ఎన్నో అద్భుతమైన క్రియేటివ్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుతున్నాయి.’ అంటారామె. రిటైర్డ్ ఉద్యోగులూ రెడీ అంటున్నారు.. ‘తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు 16 ఏళ్ల టీనేజర్ నుంచి 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు మేం ఏర్పాటు చేసే ఫ్లీ మార్కెట్స్‌లో పాల్గొంటున్నారు. ఆశ్చర్యపరిచే క్వాలిటీతో పాటు రీజనబుల్ ధరలతో వీరు ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు.’ అని చెప్పారు ట్రీ హగ్గర్స్ పేరుతో ఈ తరహా మార్కెట్లను గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న సుప్రీత. గూగుల్‌లో ఉద్యోగం వదిలేసి మరీ ఆమె ఈ రంగంలోకి మరో పార్ట్నర్తో కలిసి ప్రవేశించారు. ఎంతో మంది క్రియేటివ్ పీపుల్ మన చుట్టూ ఉన్నారని, అయితే వారి క్రియేటివిటీకి సరైన గుర్తింపు విలువ దక్కడం లేదనే ఆలోచనే తనను ఈ ఫ్లీ మార్కెట్ల నిర్వహణ వైపు నడిపించిందంటున్న సుప్రీత.. ప్రస్తుతం తమ దగ్గర 300 మంది రెగ్యులర్ క్లయింట్లు (స్టాల్స్ నిర్వాహకులు) ఉన్నారని చెబుతున్నారు. వివరాలు కావల్సిన వారు 97015 95204, 97015 87405 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారామె. -
వాడిన పూలే వికసించనీ...
తాజా పువ్వులతో ఇంటిని అలంకరించుకోవడం అందరికీ తెలిసిందే. ఆ పువ్వులు వాడిపోతే పారేయడమూ మామూలే. కాని ఎండిపోయిన పువ్వులను కూడా ఇంటి అలంకరణలో వాడచ్చు. అదెలాగో చూద్దాం. సాధారణంగా పువ్వులలో తేమ తగ్గిపోతే అవి వాడిపోతాయి. ఈ పువ్వులను చాలా బరువుగా ఉన్న పుస్తకంలో మధ్యలో ఉంచాలి. పైన ఏదైనా పెద్ద బరువు పెట్టాలి. లేదా రెండు వెడల్పాటి చెక్కల మధ్య న్యూస్‌పేపర్ లేదా టిష్యూ పేపర్ పరిచి దాని మధ్యలో పువ్వులను చక్కగా విడదీసి గట్టిగా ప్రెస్ చేసి, అలాగే ఉంచాలి. రెండు వారాల తర్వాత తీసి చూస్తే తేమంతా పోయిన పువ్వులు బాగా ఎండిపోయి కనిపిస్తాయి. ఇలాగే ఆకులు, కొమ్మలు, తీగలను ఎండిపోయే విధంగా తయారుచేసుకోవచ్చు. లేదంటే ఎండినవాటినే సేకరించవచ్చు. ఎండిన పువ్వులు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ వాల్ ఫొటోఫ్రేమ్లకు, ఫ్లవర్ బొకేలకు వాడుకోవచ్చు. ఫ్లవర్వేజ్లలో రకరకాల ఎండు గడ్డి మొక్కలు, ఎండిన పువ్వులతో అలంకరించవచ్చు. ఎండిన కంకులు, గడ్డి తీగలు, పోచలు.. కలిపి బొకేలా తయారుచేసి, ఇంటి మూలల్లో అలంకరించుకుంటే లుక్కే మారిపోతుంది. పెద్ద పెద్ద క్యాండిల్స్ సైడ్లను వేడితో కొద్దిగా మెత్తబరిచి, ఎండుపువ్వులను, ఆకులను అతికించి, గాలికి ఉంచాలి. చూడచక్కని పువ్వుల డిజైన్లతో క్యాండిల్స్ కొత్త కళను నింపుకుంటాయి. ఇంటి అలంకరణలో నచ్చిన రీతిలో ఉపయోగిస్తే ఎండు పువ్వుల సొగసులు ఎప్పటికీ వాడిపోవు. ఇంటి అందాన్ని ఎప్పుడూ వడలిపోనీయవు.