
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ హవా నడుస్తుండడంతో రకారకాల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆతాజాగా వరుడు పక్కన ఉండగానే ఒక యువకుడు వధువు పక్కన కూర్చొని ఆమెకు ముద్దులు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూడడానికి ఫన్నీగా కనిపిస్తున్న పెళ్లికొడుకు ముఖం చూస్తుంటే జాలి కలుగుతుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదో కానీ ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.
విషయంలోకి వెళితే.. రిసెప్షన్ సందర్భంగా వరుడు, వధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు వేదిక మీదకు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని వధువుకు ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఆ వ్యక్తి తన భార్యను ఏం చేస్తున్నాడోనని పక్కనే ఉన్న వరుడు ఆసక్తిగా గమనించడం విశేషం. ఆ సమయంలో యువకుడు చర్యలకు వరుడు ముఖం పాలిపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే పెళ్లికొడుకును ఏడిపించడానికే అమ్మాయి తరపు బంధువులు ఇలా ప్లాన్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏదేమైనా మరీ ఇంతలా దిగజారి ప్రవర్తించాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment