Viral Video: Drunk Groom Sleeps At His Wedding, See What Happened Next - Sakshi
Sakshi News home page

Viral Video: ఫుల్‌గాతాగి పెళ్లి మండపంలోనే నిద్రపోయిన వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే..

Published Sun, Mar 12 2023 7:57 AM | Last Updated on Sun, Mar 12 2023 12:28 PM

Viral Video: Drunk Groom Sleeps At His Wedding - Sakshi

ఇటీవల కాలంలో పెళ్లిళ్లు పెళ్లి పీటలపైనే సడెన్‌గా ఆగిపోతున్న పలు ఉదంతాలను చూస్తున్నాం. జరుగుతోంది వివాహం, ఇద్దరి వ్యక్తుల కొత్త జీవితానికి సంబంధించింది అన్న భావన లేకుండా కొందరూ వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత వారి పనుల కారణంగా పెళ్లి రద్దు చేసుకుని ఇరు కుటుంబాలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అచ్చం అలాంటి విస్తుపోయే ఘటనే అస్సాంలో చోట చేసుకుంది.
(చదవండి: Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్‌ అమెరికా అమ్మాయి)

వివరాల్లోకెళ్తే..అస్సాంలోని నల్బరీ జిల్లాలో వరుడు అతిగా మద్యం సేవించి కళ్యాణ మండపానికి వచ్చాడు. ఆ తర్వాత అక్కడ పెళ్లి పీటలపై కూర్చొని పంతులు చెప్పే మంత్రాలు చెప్పలేక నానాపాట్లు పడ్డాడు. కొద్దిసేపటికే కూర్చొన్న చోటే నేలపై పడుకుండిపోయాడు. దీంతో ఒ‍క్కసారిగా వధువు తరుఫు వారు కంగుతిన్నారు. ఆఖరికి వరుడి తండ్రి, అతని కుటుంబసభ్యులు తాగి ఉన్నారు. ఇక ఏం చేయలో కూడా పాలుపోలేదు వధువు తరఫు వారికి.

ఐతే పెళ్లి కూతురు కూడా అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో వధువు కుంటుంబ సభ్యులు వరుడు తరుపు గ్రామ పెద్దను సంప్రదించి పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు కనీసం కారులోంచి కూడా దిగలేకపోయినట్లు సమాచారం. వరుడు, అతడి కుటుంబం తీరు కారణంగా పెళ్లి ఆగినందుకు నష్టపరిహారం చెల్లించాలంటూ వధువు కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. 
(చదవండి: Sudha Murthy: కేరళ పొంగళ వేడుకల్లో సుధామూర్తి.. ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు)

(చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement