sleeps
-
పెద్దోడా ఎలా ఉన్నావ్? చిన్నోడా ఏం తింటావ్?
ఫ్రాన్స్‌లోని కౌరాన్ అనే ఊళ్లో ఉన్న 72 ఏళ్ల ఫిలిప్ గిల్లెట్ ఇంటికి వెళితే దాదాపు 400 రకాల జంతువులు, కీటకాలు, పక్షులు, జలచరాలు ఉంటాయి. వాటన్నింటిని సాకడం ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యాడు. మనం పలకరించడానికి వెళితే ‘పెద్దోడా... ఇంటికి ఎవరొచ్చారో చూడు’ అనంటే మనం దడుచుకుని చస్తాం. ఎందుకంటే ఆయన పెద్దోడా అని పిలిచింది పెద్ద మొసలిని. మొసలి మూతి యు ఆకారంలో ఉండి సైజు భారీగా ఉంటే దానిని ఎలిగేటర్ అంటారు. అలాంటి ఎలిగేటర్లు రెండు ఉన్నాయి ఆయన ఇంట్లో. ఆడుకోవాలన్నా కష్టం సుఖం చెప్పుకోవాలన్నా అవే ఆయనకు దిక్కు. పెద్దోడు, చిన్నోడు ఇల్లంతా తిరుగుతూ ఫిలిప్‌తో గారాలు పోతుంటాయి. ఇలాంటి పెద్దాయన మన ఇంటి పక్కన లేడు లక్కీగా. లేకుంటే ‘అంకుల్... ఒక కప్పు కాఫీ పోడి ఉంటే ఇస్తారా’ అని కాలింగ్‌బెల్ నొక్కి ‘పెద్దోడు’ వచ్చాడనుకోండి. ఏం చేస్తాం. హరీమనడమే. సరదాలు ఎలా ఉన్నా సృష్టిలోని ప్రతి ్ర ణిని కాపాడుకోవడం పర్యావరణ బాధ్యత. అందరితో పాటు మనం. మనతో పాటు అన్నీ. కాలుష్యం, వేట బారిన పడి ఇవి నశించి΄ోకుండా చూసుకోవాలి. -
అమ్మో..! కుంభకర్ణుడిలా ఏడాదిలో 300 రోజులు నిద్రపోతాడు..
జైపూర్: పురాణాల్లో పేర్కొన్న కుంభకర్ణుడి గురించి అందిరికీ తెలిసే ఉంటుంది. ఏడాదిలో సగం భాగం నిద్రలోనే ఉండేవాడట. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఏడాదిలో 300 రోజులూ నిద్రోలోనే గడిపేస్తాడు. ఓ అరుదైన వ్యాధి కారణంగా అతను నిత్యం నిద్రపోతాడట.. ఇంతకీ ఎవరతను.. ఏంటీ విషయం.. పుర్కారామ్.. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని భాడ్వా గ్రామానికి చెందిన వ్యక్తి. ఆక్సిస్ హెపర్‌సోమ్నియా అనే అరుదైన వ్యాధి కారణంగా అతను సంవత్సరంలో 300 రోజులు నిద్రపోతూనే ఉంటాడు. గత 23 ఏళ్లుగా ఇతను ఈ నిద్ర వ్యాధితో బాధపడుతున్నాడు. నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మెదడులో ఉండే ఈ డిజార్డర్ కారణంగానే ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. అయితే.. ఈ నిద్ర కారణంగా పుర్కారామ్ జీవితం తన రోజూవారీ పనులు కూడా చేసుకోలేడు. తినడం, స్నానం వంటి పనులు కూడా ఇతరులు సహాయం చేయాల్సి వస్తోంది. ఈ వ్యాధి సోకిన తొలినాళ్లలో చికిత్స చేపించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదని వెల్లడించారు. అయితే.. మొదట్లో రోజుకు 15 గంటలు నిద్రపోయేవాడని తెలిపారు. కాలం గడిచేకొద్దీ పుర్కారామ్ రోజులో నిద్రపోయే సమయం కూడా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పుర్కారామ్‌కు భార్య లచ్మి దేవి, తల్లి కాన్వేరీ దేవి ఉన్నారు. తమ కుటుంబ సభ్యునికి వ్యాధి నయమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు -
ఫుల్‌గా తాగి పెళ్లి మండపంలోనే నిద్రపోయిన వరుడు.. ఆ తర్వాత..
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు పెళ్లి పీటలపైనే సడెన్‌గా ఆగిపోతున్న పలు ఉదంతాలను చూస్తున్నాం. జరుగుతోంది వివాహం, ఇద్దరి వ్యక్తుల కొత్త జీవితానికి సంబంధించింది అన్న భావన లేకుండా కొందరూ వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత వారి పనుల కారణంగా పెళ్లి రద్దు చేసుకుని ఇరు కుటుంబాలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అచ్చం అలాంటి విస్తుపోయే ఘటనే అస్సాంలో చోట చేసుకుంది. (చదవండి: Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్ అమెరికా అమ్మాయి) వివరాల్లోకెళ్తే..అస్సాంలోని నల్బరీ జిల్లాలో వరుడు అతిగా మద్యం సేవించి కళ్యాణ మండపానికి వచ్చాడు. ఆ తర్వాత అక్కడ పెళ్లి పీటలపై కూర్చొని పంతులు చెప్పే మంత్రాలు చెప్పలేక నానాపాట్లు పడ్డాడు. కొద్దిసేపటికే కూర్చొన్న చోటే నేలపై పడుకుండిపోయాడు. దీంతో ఒక్కసారిగా వధువు తరుఫు వారు కంగుతిన్నారు. ఆఖరికి వరుడి తండ్రి, అతని కుటుంబసభ్యులు తాగి ఉన్నారు. ఇక ఏం చేయలో కూడా పాలుపోలేదు వధువు తరఫు వారికి. ఐతే పెళ్లి కూతురు కూడా అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో వధువు కుంటుంబ సభ్యులు వరుడు తరుపు గ్రామ పెద్దను సంప్రదించి పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు కనీసం కారులోంచి కూడా దిగలేకపోయినట్లు సమాచారం. వరుడు, అతడి కుటుంబం తీరు కారణంగా పెళ్లి ఆగినందుకు నష్టపరిహారం చెల్లించాలంటూ వధువు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. (చదవండి: Sudha Murthy: కేరళ పొంగళ వేడుకల్లో సుధామూర్తి.. ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు) Video: "Drunk" Groom Sleeps At His Own Wedding. This Happened Next https://t.co/e29q2ZgBBm pic.twitter.com/LEZgRtXbJc — NDTV (@ndtv) March 11, 2023 (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా..) -
తప్పతాగి బెడ్ మీద నగ్నంగా.. పోలీసులు షాక్
ఆయనో ప్రముఖ కంపెనీకి టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తాగుడు అలవాటుకు బానిసయ్యాడు. ఆ మత్తులో తప్పతాగి పరాయి వాళ్ల ఇంట్లో నిద్రపోయాడు. అదీ నగ్నంగా!. ఆ ఇంటి ఓనర్ తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. తీరా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. అమెరికాలోని ఫాయెట్విల్లే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...‘‘ఆదివారం తెల్లవారుజామున ఒక మహిళ నుంచి ఒక అపరిచిత వ్యక్తి మా ఇంట్లో నిద్రపోతున్నాడంటూ కాల్ వచ్చింది. దీంతో మేము హుటాహుటినా ఆమె ఇంటికి వెళ్లాం. ఆ వ్యక్తి ఆ మహిళ బెడ్ మీద నిద్రిస్తూ కనిపించాడు. అతని బట్టలన్నీ నేలపై పడి ఉన్నాయి. మేము బలవంతంగా పైకి లేపి కూర్చొబెట్టినప్పటికీ నిద్రపోవడానికే ప్రయత్నిస్తున్నాడు. మేము ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నా అతను మాట్లాడే స్థితిలో లేడు’’ అని పోలీసులు తెలిపారు. విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. అమెరికాలోని ప్రముఖ మాంసం ప్రాసెసింగ్ చేసే టైసన్ ఫుడ్స్ కంపెనీ వ్యవస్థాపకుడి మనవడు జాన్ ఆర్ టైసన్‌గా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారాయన. ఈ వ్యవహారంతో జాన్‌ను.. అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తాత పేరుప్రఖ్యాతలు, పరువు పొగొట్టిన మనవడిగా ఇప్పుడతనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ విషయమే కంపెనీ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఇది ఆయన వ్యక్తిగత విషయం అని చెప్పింది. ఐతే సదరు ఆఫీసర్ మాత్రం తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, కంపెనీ విలువలను, తన వ్యక్తిగత విలువలను దిగజార్చాను అంటూ క్షమాపణలు చెప్పాడు జాన్ టైసన్. ప్రసుతం తాను డ్రింకింగ్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కౌన్సిలింగ్ తీసుకుంటున్నానని చెప్పారు. (చదవండి: కాంట్రవర్సీ: తాగుబోతు స్టాంప్ కోసం పురుషులకు 20 ఏళ్లు.. స్త్రీలకు రెండేళ్లే చాలట!) -
చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..!
జగదేవ్‌పూర్ (గజ్వేల్): ప్రమాదంలో బాబాయ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియని ఆ పసివాడు.. అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఏడు గంటలపాటు మృతదేహంపైనే నిద్రపోయాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. మర్కూక్ మండలం నర్సన్నపేటకి చెందిన ఎక్కలదేవి ఐలయ్య(28) శనివారం రాత్రి పది గంటల సమయంలో జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లోని తన బావ వద్దకు అన్న కొడుకు మోక్షిత్ (4)ను బైక్‌పై ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాంనగర్ సమీపంలోకి రాగానే రోడ్డుపై ధాన్యం కుప్పలు రాశులుగా కవరు కప్పి ఉన్నాయి. చీకట్లో ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ఓ కుప్పను ఢీకొట్టి ఎగిరి ఇద్దరూ రోడ్డు కింద పడిపోయారు. ఐలయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. రాత్రి సమయం కావడంతో అటువైపు ఎవరూ రాలేదు. గాయాలతో షాక్‌కు గురైన బాలుడు ఏడుస్తూ బాబాయ్ మృతదేహంపైనే తల ఆనించి పడుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి బాలుడు బాబాయ్ మృతదేహంపై తలపెట్టి పడుకుని ఉన్నాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన సర్పంచ్ భానుప్రకాశ్‌రావు బాలుడిని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. -
ఓంకారం విన్న పాప ఏం చేసింది?
-
మోదీ అన్నిదేశాలు ఎలా చుట్టొచ్చారంటే..
న్యూఢిల్లీ: 'దేశాన్ని అభివృద్ధి చేసేవరకు నేను నిద్రపోను' అని ఎన్నికల సమయంలో ప్రకటనలు గుప్పించడం నాయకులకు అలవాటే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ఆ మాటను ఆచరించేవారు మాత్రం అరుదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలా. దేశాభివృద్ధికి కీలకమైన విదేశీ పెట్టుబడులను రప్పించేందుకు ఆయన కృషి అమోఘం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అనేక విదేశీ పర్యటనలు చేసిన మోదీ అద్భుతమైన టైమ్ మేనేజ్ మెంట్‌తో క్షణకాలాన్ని కూడా వృధా చేయటంలేదు. ఎలాగంటే.. నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు నేరుగా నిర్దేశిత కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ వెంటనే మరో కార్యక్రమం. లేదంటే మరో దేశానికి వెళ్లిపోతారు కానీ ఎక్కడా విశ్రాంతి కోసమో, భోజనం చేసేందుకో హోటళ్లకు వెళ్లరు. అలాంటి బ్రేక్‌ల వల్ల విలువైన సమయం వృథా అవుతుందని మోదీ భావిస్తారు. విదేశీ పర్యటనల సమయంలో ప్రధాని తన విమానం (ఎయిర్ ఇండియా వన్) లోనే నిద్రపోతారు. ఆ విధంగా సమయాన్ని ఆయన తన కంట్రోల్ లో ఉంచుకుంటారు. టైమ్ మేనేజ్ మెంట్ పై పూర్తి అవగాహన ఉండటం వల్లే ఆయన తక్కువ సమయంలో ఎక్కువ దేశాల్లో పర్యటించగలుగుతున్నారు. ప్రధాని మోదీ మార్చి 30 నుంచి ఏప్రిల్2 వరకు బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి బ్రస్సెల్, అక్కడ నుంచి వాషింగ్టన్, అటు నుంచి రియాద్ వరకు ప్రయాణిస్తున్న సమయంలో మూడు రాత్రులు ఎయిర్ ఇండియా వన్ విమానంలోనే నిద్రపోయారు. కేవలం రెండు రాత్రులు మాత్రమే వాషింగ్టన్, రియాద్‌లోని హోటల్లోబస చేశారు. మోదీ విమానంలోనే నిద్రపోవటం వల్లే కేవలం 97 గంటల్లోనే అమెరికాలాంటి దేశాలతో కలుపుకుని మూడు దేశాల్లో పర్యటించడం సాధ్యమైందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలు, చాలా వరకు అంతార్జాతీయ సదస్సులు ఉండేవి. అవి కూడా ఏదో ఒక దేశానికే ప్రయాణించేలా ఉండేవి. రాత్రికి రాత్రి ప్రయాణాలు చాలా అరుదుగా ఉండేవి. కానీ ఇప్పుడు సమయాన్ని హోటళ్లలో వృథా కాకుండా మోదీ విదేశీ పర్యటనలకు ప్రణాళికలు చేసుకుంటున్నారని అధికారులు అంటున్నారు. రెండు సంవత్సరాలలో మోదీ 95 రోజులు విదేశాల్లో పర్యటించారు. గత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ తొలి రెండు సంవత్సరాలలో 72 రోజులు విదేశాల్లో పర్యటించారు. రెండేళ్లలో 20 పర్యటనల్లో మోదీ 40 దేశాలు చుట్టారు. యూపీఏ1 హయాంలో మన్మోహన్ సింగ్ 15 పర్యటనల్లో 18 దేశాల్లో పర్యటించగా, యూపీఏ 2లో 17 పర్యటనల్లో 24దేశాల్లో మాత్రమే పర్యటించగలిగారు. -
ఫ్యాక్షన్ గ్రామంలో కలెక్టర్, ఎస్పీ నిద్ర
దేవరకొండ: కర్నూలు జిల్లా అధికారులు ఫ్యాక్షన్ గ్రామంలో సోమవారం నిద్రించనున్నారు. దేవరకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో కలెక్టర్ విజయ్ మోహన్, ఎస్పీ విజయకృష్ణ సోమవారం నిద్ర చేయనున్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలు, అందుతున్న సంక్షేమ పధకాల ఫలితాల గురించి తెలుసుకునేందుకు గ్రామంలో నిద్రచేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న అధికారులు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని రెవెన్యూ కార్యాలయం భవనంలో వారు నిద్ర చేయనున్నారు. అధికారుల నిర్ణయంపై గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
ఏకంగా వెదిక పైనే నిద్రపోయారు!!
-
రాత్రంతా అసెంబ్లీలోనే గడిపిన మంత్రి