జైపూర్: పురాణాల్లో పేర్కొన్న కుంభకర్ణుడి గురించి అందిరికీ తెలిసే ఉంటుంది. ఏడాదిలో సగం భాగం నిద్రలోనే ఉండేవాడట. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఏడాదిలో 300 రోజులూ నిద్రోలోనే గడిపేస్తాడు. ఓ అరుదైన వ్యాధి కారణంగా అతను నిత్యం నిద్రపోతాడట.. ఇంతకీ ఎవరతను.. ఏంటీ విషయం..
పుర్కారామ్.. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని భాడ్వా గ్రామానికి చెందిన వ్యక్తి. ఆక్సిస్ హెపర్‌సోమ్నియా అనే అరుదైన వ్యాధి కారణంగా అతను సంవత్సరంలో 300 రోజులు నిద్రపోతూనే ఉంటాడు. గత 23 ఏళ్లుగా ఇతను ఈ నిద్ర వ్యాధితో బాధపడుతున్నాడు. నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మెదడులో ఉండే ఈ డిజార్డర్ కారణంగానే ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు.
అయితే.. ఈ నిద్ర కారణంగా పుర్కారామ్ జీవితం తన రోజూవారీ పనులు కూడా చేసుకోలేడు. తినడం, స్నానం వంటి పనులు కూడా ఇతరులు సహాయం చేయాల్సి వస్తోంది. ఈ వ్యాధి సోకిన తొలినాళ్లలో చికిత్స చేపించామని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఎలాంటి ప‍్రయోజనం లేదని వెల్లడించారు. అయితే.. మొదట్లో రోజుకు 15 గంటలు నిద్రపోయేవాడని తెలిపారు. కాలం గడిచేకొద్దీ పుర్కారామ్ రోజులో నిద్రపోయే సమయం కూడా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పుర్కారామ్‌కు భార్య లచ్మి దేవి, తల్లి కాన్వేరీ దేవి ఉన్నారు. తమ కుటుంబ సభ్యునికి వ్యాధి నయమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment