
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఎన్నో ఆశల మధ్య కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న జంటపై విధికి కన్ను కుట్టిందేమో.. వారి సంతోషం ఎంతసేపు నిలవలేదు నిండైన మనసుతో మనువాడి గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదంలో వధువు మరణించగా.. వరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన 34 ఏళ్ల వధువు సమంతా హచిన్సన్, ఆరిక్ హచిన్సన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఉంగరాలు మార్చుకొని ఒకటయ్యారు. కొత్త జంట సంతోషంగా వివాహ రిసెప్షన్ నుంచి గోల్ఫ్ కార్టులో(మోటరైజ్డ్ వాహనం) ఊరేగింపుగా బయల్దేరారు. ఇంతలోనే వేగంగా దూసుకువచ్చిన ఓ కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గోల్ఫ్‌కార్టు దాదాపు 90 మీటర్ల దూరం ఎగిరి పడింది.
ఈ ఘటనలో వధువు అక్కడికక్కడే మరణించింది. వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని తేలింది. వరుడి మెదడుకు గాయమైందని, ఎముకలు విరిగిపోయాయని, రెండు బలమైన శస్త్రచికిత్సలు చేయవలసి వచ్చిందని అతని తల్లి తెలిపింది. వీరితోపాటు మరో ఇద్దరు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. పెళ్లైన అయిదు గంటల్లోనే ఇదంతా జరిగిపోయిందని, అరిక్ తన జీవితంతో ప్రేమను కోల్పోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
చదవండి: మహిళల కోసమే 102 అంతస్తుల భవనం! కేవలం వారు తప్ప..
కోడలు అంత్యక్రియలకు, కొడుకు వైద్య బిల్లులను చెల్లించడానికి సహాయం కోసం ఫండ్ రైసింగ్ మొదలు పెట్టింది.. ఇప్పటి వరకు 385,053 డాలర్ల కంటే ఎక్కవే లభించాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ జామీ కొమెరోస్కి(25)ను అరెస్ట్ చేశారు. కాగా పెళ్లైన తరువాత కొత్త జంట బంధువుల మధ్య సంతోషంగా నడుస్తున్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లి రోజే ఇంతటి ఊహించని ఘోరం జరగడంతో రెండు కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగాయి.
చదవండి: ఇదేం విడ్డూరం.. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్!
Comments
Please login to add a commentAdd a comment