
సాధారణంగా మొసళ్లు నీటిలోంచి బయటకు వస్తే.. వాటిని చూసి భయపడి వెంటనే దూరంగా పరుగెడుతాం. కానీ ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి ఏం చేశాడో... చూస్తే నోళ్లు వెళ్లబెట్టకుండా ఉండలేరు. తన మీదకు వచ్చిన ఓ భారీ మొసలి(ఎలిగేటర్)ని చూసి భయపడి పరిగెత్తకపోగా దానికి అతి దగ్గరగా వెళ్లి దాని తోకని నిమురుతున్న వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోను షేర్ చేసి చాలా రోజులైనప్పటికీని ఇప్పటీకీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోకు టన్నుల కొద్దీ కామెంట్లు, షేర్స్ వస్తున్నాయి. ఇంతటి భారీ మొసలిని చూసిన నెటిజన్లంతా భయపడుతూ... దానిని డైనోసర్‌తో పోలుస్తున్నారు. మరికొందరు ‘గాడ్జీల్లా’లా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా భారీ మొసలిని చూసి ఆశ్చర్యపోతుంటే కొందరు నెటిజన్లు మాత్రం ‘ఇతనికి బ్రతుకు మీద ఆశ లేదా.. చావాలనుకుంటున్నాడా?’ అంటూ ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. అయితే ఇదే వ్వక్తి కొన్ని నెలల క్రితం ఇలాంటి వీడియోనే షేర్ చేశాడు. అందులో అయితే ఏకంగా మొసలి దవడలకు చిక్కేంత దగ్గరగా వెళ‍్లాడు.
Umm nope. Nope. Nope. 🐊
— Ryan Hodgson (@Ryanintheus) October 6, 2018
🎥 (IG) @mattwright1 #travel #nature #adventure #crocodile pic.twitter.com/PlGpWpkxQG