వీడియో దృశ్యాలు
న్యూయార్క్ : ఎంతటి బలవంతులైనా అన్ని విషయాల్లో విజయం సాధించటం అన్నది సాధ్యపడదు. కొన్నికొన్ని సార్లు సృష్టిలోపాల కారణంగా ఓటమి పాలుకాక తప్పదు. అలాంటి పరస్థితే ఎదురైంది ఓ మొసలికి. మామూలుగా మొసలి నోట చిక్కిన ఏ జీవికైనా మరణం 99 శాతం ఖాయమైనట్లే. కానీ, ఓ తాబేలు మాత్రం చావు(మొసలి)నోట్లోకెళ్లి బయటకు వచ్చేసింది. చాలా కాలం క్రితం అమెరికాలోని సౌత్ కరోలినా.. హిల్టన్ హెడ్ ఐలాండ్‌లోని ఓ ఇంటి వెనుక భాగంలో ఓ మొసలి తాబేలును నోట కరుచుకుంది. ( దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు )
దాన్ని కొరికి మింగేయటానికి ప్రయత్నించింది. కానీ, తాబేలు పైడిప్ప గట్టిగా ఉండటం వల్ల జారిపోసాగింది. దానికి తోడు మొసలి పళ్ల మధ్య పడి అది కొద్దిగా సేఫ్ అవుతూ వచ్చింది. అటువైపు, ఇటువైపు జారి చివరకు దాన్నుంచి తప్పించుకుంది. మొసలి కూడా దాన్ని పట్టుకుని తినే ఓపిక లేనట్లు వదిలేసింది. తాబేలు బ్రతుకు జీవుడా అంటూ అక్కడినుంచి తుర్రుమంది. 2017 ప్రాంతానికి చెందిన ఈ వీడియోను ఐఆర్‌ఎస్ అధికారి నవీద్ త్రుంబు తాజాగా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ( కూతురి బర్త్‌డే: ఆ తండ్రి కోరిక ఇదే! )
Thick skin and a strong mind are essential if you want to survive in this world. Nobody can break you down if you don't let them. -Unknown pic.twitter.com/NePsZm5REq
— Naveed Trumboo IRS (@NaveedIRS) September 15, 2020
Comments
Please login to add a commentAdd a comment