
ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్ : ఏదైనా పుస్తకంలోని పేజీలను చదవాలంటే అందులో ఉన్న భాష మనకు తెలిస్తే సరిపోతుంది. అలా కాదని పుస్తకాన్ని కాలిస్తే ఏమవుతుంది? బూడిద మిగులుతుంది. కానీ, ఇక్కడ చెప్పుకోబోయే పుస్తకంలోని పేజీలను చదవాలంటే కచ్చితంగా వాటిని కాల్చాల్సిందే. ఎందుకంటే.. నిప్పు తగలనిదే అందులోని అక్షరాలు మనకు కనిపించవు. ఆ పుస్తకమే ప్రముఖ అమెరికన్ రచయిత రే బ్రాడ్‌బురీ రాసిన ‘‘ ఫారెన్‌హీట్ 451’’. ఇందులోని పేజీలు మొత్తం నల్లటి రంగులో ఉంటాయి. వాటిని చదవాలంటే మనం కచ్చితంగా నిప్పును తాకించాలి. ( ఇందులో మాస్కు పెట్టుకున్న వ్యక్తిని గుర్తించండి)
వీడియో దృశ్యాలు
నిప్పు తగలగానే కాగితాలపై ఉన్న నల్లటి రంగు మాయమై అక్షరాలు ప్రత్యక్షమవుతాయి. సైన్స్ గర్ల్ అనే ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఇది చాలా అద్భుతంగా ఉంది... మంత్ర, తంత్రాల పుస్తకంలా ఉంది... మాయా పుస్తకం: కాలిస్తేనే చదవగలం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( 'తిక్క కుదిరింది.. ఇలా కావాల్సిందే')
Comments
Please login to add a commentAdd a comment