కారుకు అడ్డొచ్చిన మొసలి | Car honks at lurking crocodile to get it to move out of the way as it blocks a flooded road in the Northern Territory | Sakshi
Sakshi News home page

కారుకు అడ్డొచ్చిన మొసలి

Published Wed, Aug 16 2017 10:35 AM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM

కారుకు అడ్డొచ్చిన మొసలి

కారుకు అడ్డొచ్చిన మొసలి

భారీ వరదల్లో కొట్టుకొచ్చిన ఓ మొసలి.. రోడ్డుపై ఆగింది. వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న ఆ రోడ్డుపై వాహనాలు అడపాదడపా నడుస్తూనే ఉన్నాయి. అలా వెళ్తున్న ఓ కారుకు అడ్డు మొసలి అడ్డు వచ్చింది. నీరు ప్రవహిస్తుండటంతో అతి నిదానంగా కదులుతోంది. దీంతో ట్రాఫిక్‌ ఆగిపోయింది.

అసలే వరద నీరు.. ఉధృతి పెరిగితే కార్లు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి మొసలిని త్వరగా వెళ్లిపొమ్మంటూ హారన్‌ కొట్టసాగాడు. హారన్‌ పెద్దగా మోగడం విన్న మొసలి వెంటనే రోడ్డు దాటేసింది. ఈ సన్నివేశం ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. దీన్ని చిత్రించిన ఓ వ్యక్తి వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. లక్షల మంది ఇప్పటికే ఈ వీడియోను వీక్షించి లైక్‌లు కొట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement