
ఇరుక్కుపోయిన మొసలిని జేసీబీతో నొక్కిపట్టిన దృశ్యం
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం వద్ద జాతీయ రహదారి 44 పైకి పెద్ద మొసలి వచ్చింది. అప్రోచ్ రోడ్డు వంతెనపై వరకు వెళ్లి దిగువకు దిగే ప్రయత్నంలో వేలాడుతూ అలాగే ఉండి పోయింది. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీ సహాయంతో మొసలిని పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. తాళ్లతో బంధించి దూదిగాం శివారులోని గోదావరిలో వదిలేశారు.
–బాల్కొండ
