సోన్‌పేట్ చెరువులో ఆదివారం ఉదయం జాలారులు మొసలిని బంధించి పట్టుకున్నారు.
బాల్కొండ మండలంలోని సోన్‌పేట్ గ్రామ చెరువులో ఆదివారం ఉదయం జాలారులు మొసలిని బంధించి పట్టుకున్నారు. శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్ ఆనకట్ట దిగువ భాగనే సోన్‌పేట్ గ్రామ ఊర చెరువు ఉండటంతో ప్రాజెక్ట్‌లో నుంచి మొసలి చెరువులోకి వచ్చి ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గతేడాది కూడ చెరువులోకి మొసలి రావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టుకున్న మొసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.