sriransagar project
-
పెద్దవాగుతో మొదలు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లే ప్రాజెక్టులపై కొంత స్పష్టత వచ్చింది. ఇరు రాష్ట్రాల సమ్మతి మేరకు అక్టోబర్ 14 నుంచి గోదావరి బేసిన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకునేందుకు మార్గం సుగమమైంది. శ్రీరాంసాగర్ మొదలు సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నిం టినీ బోర్డు పరిధిలో ఉంచాలన్న ఏపీ డిమాండ్‌పై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో పెద్దవాగు నిర్వహణ బాధ్యతల ను ప్రయోగాత్మకంగా చేట్టాలని సోమవారం జరిగిన బోర్డు భేటీలో నిర్ణయమైంది. పెద్దవాగును అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాక, వీటి నిర్వహణను బోర్డు చేపట్టనుంది. అయితే, దశలవారీగా ప్రాజెక్టులను అధ్యయనం చేసి వాటిని బోర్డు పరిధిలోకి తీసుకురానున్నట్లు గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. పెద్దవాగు.. సీలేరులపైనే కీలక చర్చ ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరిగింది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన భేటీకి తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, శ్యామలరావుతోపాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. గోదావరిపై తెలంగాణ ఎస్సారెస్పీ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవా లని ఏపీ పట్టుబట్టింది. దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డుపరిధిలో ఉంచాలని కోరింది. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులోనూ 13 వేల ఎకరాల మేర ఆయకట్టు ఏపీలో ఉన్నందున నిర్వహణకు వ్యయంలో ఏపీనే 85% చెల్లించాలని కోరింది. అయితే తొలిదశలో ట్రయల్ మాదిరి పెద్దవాగును పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు స్పష్టం చేసింది. దశలవారీగా మిగతా ప్రాజెక్టులను అధ్యయనం చేసి బోర్డు పరిధిలోకి తెస్తామంది. ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపింది. పెద్దవాగుకు అవసరమైన ఉత్తర్వులు వెం టనే విడుదల చేసేందుకు ఏపీ సమ్మతి తెలిపింది. సీలేరు విద్యుదుత్పత్తి ప్రాజెక్టును సైతం బోర్డు పరి ధిలోకి తేవాలని తెలంగాణ కోరింది. సీలేరు విద్యుత్‌లో సగం తెలంగాణకు రావాల్సి ఉన్నా ఏపీ ఇవ్వ డంలేదంది. దీనిపై ఏపీ అభ్యంతరం చెప్పగా, బోర్డు సైతం విద్యుదుత్పత్తి కేంద్రాల అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున.. తోసిపుచ్చింది. బడ్జెట్ ఉద్దేశం చెబితే సీడ్‌మనీ విడుదల బోర్డులుకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్‌మనీ అంశంపైనా బోర్డు భేటీలో చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాలు ప్రశ్నించాయి. నిధుల విడుదల ఆర్థికశాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే వాటినే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని ఇరు రాష్ట్రాలు వివరించాయి. నేడు కృష్ణా బోర్డు భేటీ కృష్ణా బోర్డు మంగళవారం భేటీ జరుగనుంది. ప్రాజెక్టుల అధీనంతోపాటు నిధులు, సిబ్బంది పై బోర్డులో చర్చించనున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాల చుట్టూనే ప్రధానచర్చ జరిగే అవకాశాలున్నాయి. వీటితోపాటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలోని ఔట్లెట్లపై నిర్ణయాలు వచ్చే అవకాశాలున్నాయి. -
ఎస్సారెస్పీ కింద 8 లక్షల ఎకరాలకు నీరు
► అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం ► కొన్ని కాల్వల్లో ’టేల్ టు హెడ్’ పద్ధతిన ఇవ్వాలని సూచన ► భూసేకరణకు ఇదే అనువైన సమయమని అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రబీ కార్యాచరణ ప్రణాళికను ఇరిగేషన్ శాఖ ఖరారు చేసింది. ప్రాజెక్టు ద్వారా రబీలో 8 లక్షల ఎకరాలకు సాగునీరందిం చాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికా రులకు ఆదేశాలిచ్చారు. సోమవారం ఇరిగేషన్ ఇంజనీర్లతో మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రబీ ప్రణాళికపై వరంగల్, కరీంనగర్, జగి త్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన సాగునీటి పారుదల శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి చెందిన లక్ష్మి, సరస్వతి, కాకతీయ కాల్వలు, కడెం పరిధిలో ఖరీఫ్‌లో జరిగిన ఆయకట్టుతో పాటు రబీకి సాగునీరందించే కార్యాచరణ ప్రణాళికపై మంత్రి సమీక్షించారు. కాలువల వెంట ఇంజనీర్లు స్వయంగా నడిచి పరిశీలిం చాల ని, ఎక్కడెక్కడ లీకేజీలున్నా యో గుర్తించా లన్నారు. శాశ్వత ప్రాతిపదికన మరమ్మ తులు చేపట్టేందుకు వ్యయ అంచనాలతో కూడిన ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా పంపించాలని ఆదేశించారు. ఆయా పనుల ను ఆమోదించి నిధులు మంజూరు చేస్తే వచ్చే వేసవిలోగా పనులు పూర్తవుతాయ న్నారు. మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తున్న ’టేల్ టు హెడ్’ పద్ధతిన సాగునీటి పంపిణీని ప్రయోగాత్మకంగా కొన్ని డిస్ట్రిబ్యూటరీలు, లేదా మైనర్ కెనాల్‌లలో అమలు చేయాలని మంత్రి కోరారు. ఈ విధానం వల్ల ఆయకట్టు చివరి రైతులకు నీరందకుండా పోయే సమస్యలు రావన్నారు. రబీ కార్యాచరణపై త్వరలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తానన్నారు. నీటి లభ్యతపై రైతులకు సరైన సమాచారం ముందుగానే ఇవ్వాలని, ఏ పొలం కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయ తీల ఆఫీసుల నోటీసు బోర్డులపై తప్పని సరిగా ఆ ప్రాంతానికి చెందిన జేఈ పేరు, మొబైల్ ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది చివరికల్లా ఎల్ఎండీకి నీరు 2017 డిసెంబర్ కల్లా మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీరందిస్తామని మంత్రి హరీశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్ఎండీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో రైతులు భూములిచ్చేందుకు ముందుకు వస్తారని, ప్రభుత్వం వైట్ మనీ ఇస్తుంది కనుక భూసేకరణకు ఇప్పుడు అనువైన సమయమని మంత్రి అభిప్రాయపడ్డారు. -
‘బాబ్లీ’ దెబ్బ
ఎస్సారెస్పీలో నాలుగు రోజుల్లో మూడు టీఎంసీల నీరు త గ్గుదల ఎగువ నుంచి పూర్తిగా నిలిచిన వరద నీరు కాల్వల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ ప్రభావం అప్పుడే కనపడుతోంది. బాబ్లీ గేట్లు మూసిన మరునాటి నుంచే నీటిమట్టం తగ్గుతోంది. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు గత నెల 29న అధికారులు మూసి వేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత వారబందీ గత నెల 24 నుంచి కొనసాగుతుంది. కానీ ప్రాజెక్ట్‌లో గతనెల 29 వరకు చుక్క నీరు తగ్గుముఖం పట్టలేదు. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగినప్పటికీ నీరు తగ్గలేదు. కానీ బాబ్లీ గేట్లు మూసిన రెండు రోజుల నుంచి క్రమంగా ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. గేట్లు మూసినప్పటి నుంచి ప్రాజెక్ట్‌లో 0.70 అడుగుల నీటి మట్టం తగ్గింది. గేట్ల మూసివేతకు ముందే అంతేస్థాయిలో ప్రాజెక్ట్ నుంచి కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగినా ప్రాజెక్టు నీటిమట్టం తగ్గలేదు. కారణమేమిటంటే ఎగువ ప్రాంతాల నుంచి కాల్వల ద్వారా ఎంత నీటి విడుదల జరిగిందో అంత స్థాయిలో ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. బాబ్లీ గేట్లు మూసి వేయడంతో ప్రాజెక్ట్‌లోకి చుక్క నీరు రాకుండా అడ్డుగా మారింది. అలాగే నికర జలాలను కూడా తోడుకునే విధంగా బాబ్లీ ప్రాజెక్టు ఉండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం 6,217 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో 3 టీఎంసీల నీరు తగ్గిపోయింది. ప్రాజెక్టు ఔట్‌ఫ్లోకు తగ్గిన నీటిమట్టం సమానంగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. కాని గేట్లు మూసివేయక ముందు నీటి మట్టం తగ్గకపోవడానికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరే కారణం. ప్రస్తుతం గేట్లు మూసివేయడం ఆ నీటికి అడ్డుకట్ట పడింది. 24 నుంచి 29 వరకు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత వారబందీ అక్టోబర్ 24న ప్రారంభించారు. కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది. కానీ ఆ 5 రోజులు ప్రాజెక్ట్ నీటిమట్టం ఒక చుక్క నీరు తగ్గ లేదు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులతో నిండుకుండలా ఉంది. కానీ బాబ్లీ గేట్లు మూసినప్పటి నుంచి ప్రాజెక్ట్ నీటి మట్టం రోజుకు 0.10 అడుగుల చొప్పున తగ్గుతూ వచ్చింది. 30 నుంచి ప్రాజెక్ట్ నీటి మ ట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్‌లో 3 టీఎంసీల నీరు ఇప్పుడే తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 87 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు చెబతున్నారు. -
ఎస్సారెస్పీ నుంచి 9 లక్షల ఎకరాలకు నీరు
బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి రబీలో 9 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగు నీరందించేందుకు అధికారులు ప్రణాళి క సిద్ధం చేశారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి ఆయక ట్టు 18 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు పూర్తిస్థాయి ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేదు. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు ప్రాజెక్టులో ఉన్నాయి. దీంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ, ఎత్తిపోతల పథకాల ద్వారా రబీలో నీటి విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రాజెక్ట్‌లోకి సకాలంలో వరదలు రాక ఖరీఫ్‌లో 6 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి సరఫరా చేశారు. రబీలో ఎల్ఎండీ దిగువకు నీటినివ్వాలని నిర్ణయించారు. -
ఎస్సారెస్పీ 26 గేట్ల ఎత్తివేత
ఎస్సారెస్పీ 26 గేట్ల ఎత్తివేత బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ 26 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి లక్ష క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గురువారం ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో 9 వరద గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. శుక్రవారం ఉదయం వరద నీరు పోటెత్తడంతో మళ్లీ గేట్లను పెంచి నీటి విడుదలను పెంచారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4,500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 4 టర్బయిన్ల ద్వార 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులతో నిండుకుండలా ఉంది. నిజాంసాగర్ నుంచి 12 వేల క్యూసెక్కులు నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నీటితో నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న 21 వేల క్యూసెక్కుల వరదనీటిని అంతే మొత్తంలో శుక్రవారం ప్రాజెక్టు 4, 5 వరదగేట్ల ద్వారా దిగువనకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులతో 17.8 టీంఎసీల నీరు పూర్తిస్థాయిలో నిల్వ ఉంది. అన్నదాత ఆత్మహత్య భిక్కనూరు: నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్‌కు చెందిన రైతు సంగెపు బీరయ్య(40) పంట దెబ్బతినడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బీరయ్య తన ఎకరం 16 గుంటల్లో మక్కపంటను వేశాడు. గ్రామంలో గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. ఇటీవల మక్కపంట చేతికి రావడంతో పంటలు కోసి జూడుగా పెట్టాడు. ఐదు రోజులు వరుసగా వర్షాలు కురియడంతో మక్కపంట తడిసి ముద్దయి మొలకెత్తి బూజు పట్టింది. ఇదివరకే రూ. 4 లక్షల అప్పు ఉంది. మక్క పంట దెబ్బతినడంతో మానసిక వేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి కొట్టం వద్దకు వెళ్లి ఉరేసుకున్నాడు. -
సోన్‌పేట చెరువులో మొసలి
బాల్కొండ మండలంలోని సోన్‌పేట్ గ్రామ చెరువులో ఆదివారం ఉదయం జాలారులు మొసలిని బంధించి పట్టుకున్నారు. శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్ ఆనకట్ట దిగువ భాగనే సోన్‌పేట్ గ్రామ ఊర చెరువు ఉండటంతో ప్రాజెక్ట్‌లో నుంచి మొసలి చెరువులోకి వచ్చి ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గతేడాది కూడ చెరువులోకి మొసలి రావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టుకున్న మొసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. -
పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 23 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వార 4,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వార 6 వేల క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వార 50 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వార 100 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వార నీటి విడుదలతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు టర్బయిన్ల ద్వార 11.6 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్కో అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1078.00(47.12 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. -
తెరుచుకున్న బాబ్లీ గేట్లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను కేంద్ర జలవనరుల సంఘం సభ్యుల సమక్షంలో శుక్రవారం ఎత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 28న మూసి వేయాలి. త్రిసభ్య కమిటీ సభ్యులైన ఎస్సారెస్పీ ఈఈ రామారావు, మహారాష్ట్ర ఈఈ లవరాలే, సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్‌ల పర్యవేక్షణలో ఈ గేట్లను ఎత్తారు. దీంతో గోదావరిలో 6 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా, స్థానికంగా కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లోకి స్వల్ప వరద నీరు వచ్చి చేర డంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. - రెంజల్/బాల్కొండ -
బాబ్లీ తెరిచినా ఒరిగేది లేదు!
♦ బోసిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ♦ 18 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం ♦ 4.5 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం ♦ నేడు మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఎత్తివేత సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) నీరు లేక వెల వెల బోతోంది. దీంతో ఆయకట్టు రైతులు ‘శ్రీరామా కరుణించ వేమిరా’.. అంటూ వేడుకుంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి జూన్ మాసం దాటినా ఇప్పటి వరకు భారీ వరద నీరు వచ్చి చేరలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి ఆధారంగా 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీరు లేక పోవడంతో ఆయకట్టు ప్రశ్నాకర్థంగా మారింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) అయితే ప్రస్తుత నీటి మట్టం 1046.60( 4.5 టీఎంసీలు) అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీకి దిగువ భాగాన ప్రాజెక్ట్ నీరు ఉంది. ప్రాజెక్ట్‌లోకి భారీ వరద నీరు వచ్చి చేరితే ఖరీఫ్ ఆశాజనకంగా ఉంటుందని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా గత రెండు సంవత్సరాలుగా ఎస్సారెస్పీలోకి వరదలు రాక ఏడాదంతా నీరు లేక బోసి పోయింది. జూన్ మాసం దాటినా ఇంత వరకు చుక్క వరద నీరు వచ్చి చేరలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పనక్కర్లేదు. ఇదే క్రమంలో శుక్రవారం ఉదయం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గేట్లు తెరనుండగా.. దాంతోనూ ప్రయోజనం కనిపించడం లేదు. మహారాష్ట్ర నుంచే ప్రధాన వరదలు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ప్రధాన వరద నీరు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచే వచ్చి చేరుతుంది. కాని ప్రస్తుత సంవత్సరం ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్, విష్ణుపురి , గైక్వాడ్ ప్రాజెక్ట్‌లు డెడ్ స్టోరేజీలోనే ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్‌లు నిండిన తరువాతనే ఎస్సారెస్పీలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కాని ఆ ప్రాజెక్ట్‌లే నీరు లేక వెలవెల బోతున్నాయి. అధిక వరద నీరు వచ్చి చేరే గోదావరి ప్రాంతం నీరు లేక బోసి పోతోంది. ఇంకా ప్రాజెక్ట్ ఎలా నిండుతుందని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగన మహా సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు సుప్రీం తీర్పు ప్రకారం జూలై 1న గేట్లు ఎత్తినా ఎస్సారెస్పీకి పెద్దగా వరద నీరు వచ్చి చేరే అవకాశం లేదు. బాబ్లీ ప్రాజెక్ట్ కూడ నీరు లేక వెల వెల బోతోంది. బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 2.4 టీఎంసీలు కాగా ప్రాజెక్ట్‌లో కేవలం 0.006 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్ట్‌లో ఉంది. మళ్లీ బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అక్టోబర్ 28న మూసి వేస్తారు. బాబ్లీ గేట్లు ఎత్తినా ఎస్సారెస్పీకి ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు అధికారులు. డెడ్‌స్టోరేజీకి దిగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.... ఎస్సారెస్పీ నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి దిగువన ఉంది. 1987 తరువాత ప్రస్తుత సంవత్సరమే ఇంత కనీష్ట స్థాయికి ప్రాజెక్ట్ నీటి మట్టం పడిపోయిందని అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రాజెక్ట్ డెడ్‌స్టోరేజీ 5 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నిల్వ ఉంది 4.5 టీఎంసీల నీరు మాత్రమే! ప్రాజెక్ట్‌లోకి వరదలు వచ్చి చేరక పోతే సాగు నీరు అవసరాలు తీర్చడం దేవుడెరుగు.. కనీసం తాగు నీటి అవసరాలు కూడ తీరే పరిస్థితి కనిపించడం లేదు. మహారాష్ట్రలో నేడే బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తి వేత.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన ప్రాజెక్ట్‌కు 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను శుక్రవారం ఉదయం ఎత్తనున్నట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ సత్యనారియణ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ గేట్లను ఎత్తాలి. అక్టోబర్ 28న మూసి వేయాలి. దాంట్లో భాగంగానే బాబ్లీ గే ట్లను ఎత్తుతారు. గేట్ల ఎత్తివేత త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. తెలంగాణ తరుపున ప్రాజెక్ట్ ఎస్ఈ సత్యనారాయణ, మహారాష్ట్ర తరుపున నాందెడ్ ఈఈ లవరాలే, సీడ బ్ల్యూసీ తరుపున ఈఈ శ్రీనివాస్ పాల్గొంటున్నారన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తి నీటి సామర్థ్యం 2.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్ట్‌లో 0.006 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తినా గోదావరి ప్రవహించే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీపై ఆధారపడిన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. -
ఔను.. వాళ్లు ఒక్కటయ్యారు!
♦ సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు ♦ అసోసియేషన్ పేరుతో దందా ♦ రైతుకు ‘మట్టి’కొట్టేందుకు ఎత్తుగడ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలిస్తున్న వ్యాపారులంతా ఒక్కటయ్యారు. ప్రాజెక్ట్ నుంచి నల్లమట్టి తరలించే వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను పెంచి రైతులను దగా చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నదాతకు ‘మట్టి’ కొట్టేందుకు ఆదివా రం సమావేశమైన వ్యాపారులు.. తెలంగాణ టిప్పర్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. అసోసియేషన్‌కు చెందిన పోస్టర్లను టిప్పర్లకు అతికించి మరీ నల్లమట్టిని తరలిస్తున్నారు. ఒక్కటైన వ్యాపారులంతా ఒకే ధరకు మట్టిని విక్రయించాలని నిబంధనలు విధించుకున్నారు. అంతే కాకుండా ధరల పట్టికను కూడా సిద్ధం చేశారు. ఫలితంగా అన్నదాత ఆరుగాలం కష్టపడి పోగేసిన డబ్బు ‘మట్టి’పాలయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడే ఎందుకో..? శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సుమారు రెండున్నర నెలలుగా నల్లమట్టిని రైతుల కోసమంటూ తరలిస్తున్నారు. రైతులకు ఎలాంటి భారం కాకుడదని ప్రాజెక్ట్ అధికారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా మట్టిని తరలించేందుకు అనుమతించారు. ఇన్నాళ్లు ఎవరికి వారే మట్టిని తరలించిన వ్యాపారులు సిండి‘కేటుగాళ్లు’గా మారారు. అంతా కలిసి అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. అయితే, ఇన్నాళ్లుగా ఏర్పాటు చేయని అసోసియేషన్ ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిం దో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్ ఏర్పాటుకు ముందు అధికారులు ఎక్కడా నల్లమట్టి తరలింపును అడ్డుకోలేదు. మరి అలాంటప్పుడు ‘అసోసియేషన్’ ఎందుకో వ్యాపారులకే తెలియాలి. అసోసియేషన్‌కు సభ్యత్వ రుసుం.. తెలంగాణ టిప్పర్ అసోషియేషన్‌లో సభ్యత్వం కోసం డబ్బులు వసూలు చేసినట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. టిప్పరు రూ.1000, డంపర్‌కు రూ.2 వేల చొప్పున చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా ఇప్పటివరకు సుమారు 150 వరకు టిప్పర్లు, డంపర్ల పేరుతో అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసమేనా..?! ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలించేందుకు కొందరు వ్యాపారులు తమిళనాడు, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో టిప్పర్లను తీసుకువచ్చారు. దీంతో పోటీ తీవ్రమైంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు తక్కువ ధరకే నల్లమట్టిని విక్రయించారు. దీనివల్ల రైతులకు కొంత ఊరట లభించింది. అయితే, పోటీ వల్ల దందా దెబ్బ తింటుందని భావించిన వ్యాపారులు.. ‘ఒకే ధర’ నిబంధనను అమలు చేసేందుకు అసోసియేషన్‌గా ఏర్పడినట్లు తెలిసింది. దీనివల్ల రైతులపై ధరాభారం పడనుంది. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా రైతుల పేరుతో మట్టి దందాకు శ్రీకారం చుట్టారు! పోస్టర్ ఉంటేనే.. సభ్యత్వం తీసుకున్న టిప్పర్లకు ‘తెలంగాణ టిప్పర్ అసోషియేషన్’కు చెందిన పోస్టర్లను అతికించారు. ఎస్సారెస్పీ నుంచి నల్ల మట్టి తరలించే ప్రతి టిప్పర్‌కు అసోసియేషన్ పోస్టర్ ఉండాలి. లేదంటే నల్లమట్టి తరలించేందుకు వీలు లేదనే నిబంధన పెట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టిని తరలించేందుకు ప్రాజెక్ట్ అధికారులకు సీనరేజ్ చెల్లించాలి. కానీ సీనరేజ్ చెల్లిస్తే ఆ భారం అంతిమంగా రైతుపైనే పడుతుందని చిలుక పలుకులు పలుకుతున్న వ్యాపారులకు.. అసోసియేషన్ సభ్యత్వ రుసుము భారం కూడా రైతులపైనే పడుతుందని తెలియదా..? -
ఆశలు ఆవిరే..
- గుత్ప ఎత్తిపోతల ద్వారా గోదావరిలోకి చేరని నీరు - 38,792 ఎకరాల సాగు ప్రశ్నార్థకమే - రైతుల జీవితాల్లో మళ్లీ అంధకారం నందిపేట : ప్రతి ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యంతో దివంగత మఖ్యమం త్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన గుత్ప ఎత్తిపోతల పథకం ప్రస్తుతం నిర్వీర్యమవుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ తీరంలోని నందిపేట మండలం ఉమ్మెడ శివారులో గోదావరి నదిని ఆనుకుని నిర్మించిన అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలకు చుక్క నీరందే పరిస్థితి లేదు. 8 సంవత్సరాల పాటు రైతులకు సాగునీరందించిన ఈ పథకానికి.. ఇప్పుడు గోదావరిలో ప్రవాహం పూర్తిగా సన్నగిల్లడంతో నీటి సరఫరా నిలిచిపోరుుంది. దీంతో తొలిసారిగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఈ ఎత్తిపోతల ద్వారా ఆయకట్టు పంటలకు సాగు నీరు విడుదల కాలేదు. గుత్పతో సస్యశ్యామలం.. ఎనిమిది సంవత్సరాలుగా గుత్ప ఎత్తిపోతల ద్వారా 540 క్యూసెక్కుల నీటిని తోడి రైతులకు నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా 38,792 ఎకరాలకు సాగునీరందించారు. దీంతో నందిపేట, మాక్లూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూర్, ఆర్మూర్ మండలాల పరిదిలోని 55 గ్రామాలలో పంటలు సాగయ్యూయి. ఫలితంగా ఎన్నో ఎళ్లుగా బీడుగా ఉన్న భూములు పంట పొలాలుగా మారాయి. దుర్భర జీవితాలు గడుపుతున్న ైరె తుల కుటుంబాలలో ఈ పథకం వెలుగులు నింపింది. ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకమే.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ జూన్‌లోనే ప్రారంభమైనా, ఇంతవరకు సరైన వర్షాలు కురియక పోవడం, గోదావరి ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆ నది నీటి ప్రవాహం లేక గుత్ప ఎత్తిపోతల పథకం ఉత్సవ విగ్రహంలా మారింది. దీంతో దీని పరిధిలోని 38,792 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు భూగర్భ జలాలు సైతం అడుగంటి పోవడంతో వందల సంఖ్యలో బోరుబావులు సైతం ఎండిపోయూరుు. జూలై మొదటి వారంలోనే భూగర్భ జలాలు దిగువకు పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్నందున అనేక మంది రైతులు కొత్తగా 200-300 అడుగుల లోతు వరకు బోర్లు తవ్విస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుత్ప ఆయకట్టు పరిధిలో కనీసం 30 శాతం విస్తీర్ణంలో కూడా వరి నాట్లు పడలేదు. పదేళ్ల క్రితం గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని, తిరిగి ఇప్పుడు అలాంటి పరిస్థితే పునారవృతం అవుతోందని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీసారి ఖరీఫ్, రబీ సీజన్లలో వరినాట్లు వేసుకునేందుకు ముందస్తుగానే ఒక దఫా గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేవారు. దాంతో ఆయకట్టు రైతులు ఆ నీటిని తమ పొలాల్లోకి మళ్లించుకుని జోరుగా వరినాట్లు వేసేవారు. అలాంటిది ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారు కావడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోరుుంది. సాగునీటి మాటెలా ఉన్నా కనీసం తాగునీటికి కూడ తిప్పలు తప్పేలా లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
నేడు జిల్లాకు సీఎం కేసీఆర్
నేడు జిల్లాకు సీఎంకేసీఆర్ రేపు ‘కంతనపల్లి, దేవాదుల’ ఏరియల్ సర్వే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు కరీంనగర్‌ను దాటి వరంగల్ జిల్లాకు రావడం ఇబ్బందిగానే ఉంది. సాంకేతిక లోపాలతో దేవాదులను సామర్థ్యం మేరకు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఈ రెండు ప్రాజెక్టుల ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే కంతనపల్లి ఒక్కటే మార్గం. అలాంటి బృహత్తర ప్రాజెక్ట్ నిర్మాణానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నారుు. సీఎం కేసీఆర్ ఆదివారం కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేస్తుండడంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. కంతన పల్లిపై కదలిక తెస్తారని.. దేవాదుల, ఎస్సారెస్పీ దిశాదశ మారుస్తారని.. తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తారని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ వరంగల్: గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన దేవాదుల(జువ్వాడి చొక్కారావు గోదావరి ఎత్తిపోతల పథకం) నిర్మాణం ప్రారంభించి పుష్కరం దాటినా ఎన్నటికి పూర్తయ్యేనో తేలియడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతోనైనా ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందనేది జిల్లావాసుల ఆశ. వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 30 మండలాల్లో 6.21 లక్షల ఎకరాలకు 38.18 టీఎంసీల నీరందించేందుకు 1999లోనే కేంద్ర జల వనరుల సంఘం సభ్యుడు విద్యాసాగర్‌రావు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్మాణం చేయలేమంటూ ఏళ్లపాటు పట్టించుకోని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం... చివరకు 2003లో ఫైల్‌ను బయటకు తీసింది. బాబు 2003 జూన్‌లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క రూపాయి నిధులివ్వలేదు. నిధుల్లేక భూ సేకరణ ఆగింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కడియం శ్రీహరి ఉన్నప్పుడే రూ.783 కోట్లతో టెండర్లు పూర్తరుునా నిధులు విడుదల కాలేదు. రూ.930 కోట్లతో దేవాదుల ఫేజ్-1 ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. టెండర్లు పిలిచే సమయానికి రూ.783 కోట్లకు తగ్గించారు. ఈ ధరకే చంద్రకు సన్నిహితంగా ఉండే ఓ సంస్థకు టెండర్లు అప్పగించారు. 2004 జనవరిలో పనులు చేసేందుకు కంపెనీ.. అగ్రిమెంట్ చేసుకుంది. తర్వాత తొలిసారిగా దేవాదుల ప్రాజెక్టుకు రూ.93.50 కోట్లు మాత్ర మే విడుదల చేశారు. తొలి విడతలో 5.18 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేందుకు రూ.930 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం 2006 జులై 7న సాంకేతిక అనుమతి మంజూ రు ఇస్తూ టెండర్లు పిలిచింది. ప్రాజెక్టుతో మొత్తం 1.24 లక్షల ఎకరాల బీడుభూమిని సాగులోకి తీసుకురానున్నారు. గంగారం ఇంటెక్ వెల్ నుంచి భీంఘన్‌పూర్, అక్కడ నుంచి పులుకుర్తి, ధర్మసాగర్ రిజర్వాయరు నిర్మాణం చేపట్టనున్నట్లు తొలివిడతలో రూపొందించారు. మొదటి, రెండో విడతల్లో పనులలో ధర్మసాగర్ వరకు పూర్తయినా నిర్దేశించినా ఆయకట్టుకు నీరివ్వలేకపోతున్నారు. వైఎస్సార్ రాకతో... 2004 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయించారు. 1.24 లక్షల ఎకరాల ఆయకట్టుకు మరో 844 ఎకరాల ఆయకట్టును పెంచారు. దీంతో మొదటి విడతకు రూ.1319.38 కోట్లు కేటాయించారు. అప్పటి నుంచి దేవాదుల మొదటి, రెండో దశ పనులు ముందుకు సాగాయి. తొలిదశలో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందుతోంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో మొదటి, రెండు దశలు పైపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తుండగా మూడో దశలో సొరంగం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 58 కిలోమీటర్ల పైపులైను నిర్మాణం కోసం 2005లో రూ.945కోట్లు మంజూరయ్యాయి. 2008లో టెండర్లు నిర్వహించగా ఈ పనులను కోస్టల్ కంపెనీ దక్కించుకుంది. పనులు జరుగుతుండగా శాయంపేట మండలం వసంతపూర్ వద్ద బుంగ ఏర్పడడంతో సొరంగంలో నీరు చేరి ముగ్గురు కార్మికులు జలసమాధి అయ్యారు. అప్పటి నుంని పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు టన్నెల్ నిర్మాణంలో పేల్చివేతల వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం ఏర్పడుతుందని పురావస్తు శాఖ అభ్యంతరం చెప్పడంతో సొరంగం అలైన్మెంట్ మార్చాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఈ అలైన్మెంట్లు మూడుసార్లు మార్చారు. మూడో సారి అలైన్మెంటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
రబీకి గండం
గతేడాది నీటితో నిండు కుండల్లా కనిపించిన ప్రాజెక్టులు ఈసారి వర్షాభావంతో వెలవెలబోతున్నాయి. జిల్లా వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈసారి కనీస వరద నీరు కూడా చేరలేదు. ఫలితంగా రెండు పంటలకు నీరందించాల్సిన ప్రాజెక్టు.. ఒక్క పంటకు కూడా నీరందించలేని దుస్థితిలో ఉంది. తిమ్మాపూర్ : ఖరీఫ్ సీజన్‌ను కన్నీటితో ముగిస్తున్న రైతులను రబీ సీజన్ బెంబేలెత్తిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేక... 90 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ సారి చుక్క వరద నీరు చేరలేదు. ప్రాజెక్టు పరిధిలో మొదటి ఫేజ్‌లో ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ ఎగువన 144 కిలోమీటర్ల వరకు 4.07 లక్షల ఎకరాలు, ఎల్ఎండీ దిగువన 146 నుంచి 285 కిలోమీటర్ల వరకు 4.94 లక్షల ఆయకట్టు ఉంది. రెండో ఫేజ్‌లో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తంగా 18 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరితే ఆయకట్టు మొత్తానికి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రెండు పంటలకు నీరందించేవారు. సాగునీటికి ఖరీఫ్‌లో 34 టీఎంసీలు, రబీ కోసం 50 టీఎంసీల నీరు అవసరముంటుంది. ఆశించిన మేర వర్షాలు లేక ఖరీఫ్‌లో యాభై శాతం భూములు కూడా సాగవలేదు. ఎస్సారెస్పీలో 90 టీఎంసీల సామర్థ్యానికి గాను 24 టీఎంసీలే ఉండగా, ఎల్ఎండీలో 24 టీఎంసీలకు గాను 7.252 టీఎంసీల నీరే ఉంది. ఈ నీరంతా గతేడాది నిల్వ ఉన్న నీరే. ఖరీఫ్ సీజన్లో పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోవడంతో ఖరీఫ్ చివరిదశలో ఒక తడి నీరు అందించారు. ప్రాజెక్టులో నీరు లేక ఈ రబీ సీజన్‌కు సాగునీరిచ్చే అవకాశమే లేదని సీఈ శంకర్ శుక్రవారం ప్రకటించారు. ఇప్పుడున్న నీరు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతుందని తెలిపారు. ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో గోదావరి వరద నీరు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. దీంతో రబీలో ఆయకట్టు మొత్తం బీడుగానే ఉండే పరి స్థితులు నెలకొన్నాయి. మొత్తంగా బోర్లు, బావు లు ఉన్నచోట లక్ష ఎకరాలు మాత్రమే సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిల్వలు తాగునీటికే... ఎస్సారెస్పీలో ప్రస్తుతం 24 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా ఇవి తాగునీటి అవసరాలకే కేటాయించనున్నారు. 5 టీఎంసీలు నీరు తాగునీటి అవసరాలకు పోను, మరో ఐదు టీఎంసీ లు ఆవిరిగా చూపుతారు. మిగతా 14 టీఎంసీ ల్లో ఐదు టీఎంసీలు కనీస నీటి మట్టం కాగా, 9 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. సాగునీటి కోసం ఈ నీరు ఏ మాత్రం సరిపోయే అవకాశం లేకపోగా భవిష్యత్ కోసం నిల్వ ఉంచే అవకాశముంది. వర్షాలు పడేవరకు నీటిని కాపాడుకుం టూ తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని సీఈ శంకర్ తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ సిద్దిపేట, వరంగల్ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ నీరే ఆధారం. దీంతోపాటు ఎన్టీపీసీకి సైతం నీరందించాల్సి ఉంది. సాగునీటికి విడుదల చేస్తే ఎండాకాలం లో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదముందని అధికారులు ముందు జాగ్రత్త పడుతున్నారు.