ఎస్సారెస్పీ నుంచి 9 లక్షల ఎకరాలకు నీరు
బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి రబీలో 9 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగు నీరందించేందుకు అధికారులు ప్రణాళి క సిద్ధం చేశారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి ఆయక ట్టు 18 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు పూర్తిస్థాయి ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేదు. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.
పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు ప్రాజెక్టులో ఉన్నాయి. దీంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ, ఎత్తిపోతల పథకాల ద్వారా రబీలో నీటి విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రాజెక్ట్‌లోకి సకాలంలో వరదలు రాక ఖరీఫ్‌లో 6 లక్షల ఎకరాలకు మాత్రమే నీటి సరఫరా చేశారు. రబీలో ఎల్‌ఎండీ దిగువకు నీటినివ్వాలని నిర్ణయించారు.