తెరుచుకున్న బాబ్లీ గేట్లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను కేంద్ర జలవనరుల సంఘం సభ్యుల సమక్షంలో శుక్రవారం ఎత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తి, అక్టోబర్ 28న మూసి వేయాలి.
త్రిసభ్య కమిటీ సభ్యులైన ఎస్సారెస్పీ ఈఈ రామారావు, మహారాష్ట్ర ఈఈ లవరాలే, సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్‌ల పర్యవేక్షణలో ఈ గేట్లను ఎత్తారు. దీంతో గోదావరిలో 6 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాగా, స్థానికంగా కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లోకి స్వల్ప వరద నీరు వచ్చి చేర డంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.
- రెంజల్/బాల్కొండ