‘బాబ్లీ’ దెబ్బ | In the flood water | Sakshi
Sakshi News home page

‘బాబ్లీ’ దెబ్బ

Published Sat, Nov 5 2016 1:02 AM | Last Updated on Wed, Aug 1 2018 4:01 PM

‘బాబ్లీ’   దెబ్బ - Sakshi

‘బాబ్లీ’ దెబ్బ

ఎస్సారెస్పీలో నాలుగు రోజుల్లో మూడు టీఎంసీల నీరు త గ్గుదల
ఎగువ నుంచి పూర్తిగా  నిలిచిన వరద నీరు
కాల్వల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల     

బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ ప్రభావం అప్పుడే కనపడుతోంది. బాబ్లీ గేట్లు మూసిన మరునాటి నుంచే నీటిమట్టం తగ్గుతోంది. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు గత నెల 29న అధికారులు మూసి వేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత వారబందీ గత నెల 24 నుంచి కొనసాగుతుంది. కానీ ప్రాజెక్ట్‌లో గతనెల 29 వరకు చుక్క నీరు తగ్గుముఖం పట్టలేదు. కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగినప్పటికీ నీరు తగ్గలేదు. కానీ బాబ్లీ గేట్లు మూసిన రెండు రోజుల నుంచి క్రమంగా ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. గేట్లు మూసినప్పటి నుంచి ప్రాజెక్ట్‌లో 0.70 అడుగుల నీటి మట్టం తగ్గింది. గేట్ల మూసివేతకు ముందే అంతేస్థాయిలో ప్రాజెక్ట్ నుంచి కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగినా ప్రాజెక్టు నీటిమట్టం తగ్గలేదు. కారణమేమిటంటే ఎగువ ప్రాంతాల నుంచి కాల్వల ద్వారా ఎంత నీటి విడుదల జరిగిందో అంత స్థాయిలో ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరింది. బాబ్లీ గేట్లు మూసి వేయడంతో ప్రాజెక్ట్‌లోకి చుక్క నీరు రాకుండా అడ్డుగా మారింది.

అలాగే నికర జలాలను కూడా తోడుకునే విధంగా బాబ్లీ ప్రాజెక్టు ఉండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం 6,217 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో 3 టీఎంసీల నీరు తగ్గిపోయింది. ప్రాజెక్టు ఔట్‌ఫ్లోకు తగ్గిన నీటిమట్టం సమానంగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. కాని గేట్లు మూసివేయక ముందు నీటి మట్టం తగ్గకపోవడానికి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరే కారణం. ప్రస్తుతం గేట్లు మూసివేయడం ఆ నీటికి అడ్డుకట్ట పడింది.

24 నుంచి 29 వరకు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి  ప్రస్తుత వారబందీ అక్టోబర్ 24న ప్రారంభించారు. కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది. కానీ ఆ 5 రోజులు ప్రాజెక్ట్ నీటిమట్టం ఒక చుక్క నీరు తగ్గ లేదు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులతో నిండుకుండలా ఉంది. కానీ బాబ్లీ గేట్లు మూసినప్పటి నుంచి ప్రాజెక్ట్ నీటి మట్టం రోజుకు 0.10 అడుగుల చొప్పున తగ్గుతూ వచ్చింది. 30 నుంచి ప్రాజెక్ట్ నీటి మ ట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్‌లో 3 టీఎంసీల నీరు ఇప్పుడే తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 87 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు చెబతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement