ఎస్సారెస్పీ కింద 8 లక్షల ఎకరాలకు నీరు
► అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
► కొన్ని కాల్వల్లో ’టేల్ టు హెడ్’ పద్ధతిన ఇవ్వాలని సూచన
► భూసేకరణకు ఇదే అనువైన సమయమని అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రబీ కార్యాచరణ ప్రణాళికను ఇరిగేషన్ శాఖ ఖరారు చేసింది. ప్రాజెక్టు ద్వారా రబీలో 8 లక్షల ఎకరాలకు సాగునీరందిం చాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికా రులకు ఆదేశాలిచ్చారు. సోమవారం ఇరిగేషన్ ఇంజనీర్లతో మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రబీ ప్రణాళికపై వరంగల్, కరీంనగర్, జగి త్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన సాగునీటి పారుదల శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి చెందిన లక్ష్మి, సరస్వతి, కాకతీయ కాల్వలు, కడెం పరిధిలో ఖరీఫ్‌లో జరిగిన ఆయకట్టుతో పాటు రబీకి సాగునీరందించే కార్యాచరణ ప్రణాళికపై మంత్రి సమీక్షించారు. కాలువల వెంట ఇంజనీర్లు స్వయంగా నడిచి పరిశీలిం చాల ని, ఎక్కడెక్కడ లీకేజీలున్నా యో గుర్తించా లన్నారు.
శాశ్వత ప్రాతిపదికన మరమ్మ తులు చేపట్టేందుకు వ్యయ అంచనాలతో కూడిన ప్రతిపాదనలు ఈ నెలాఖరులోగా పంపించాలని ఆదేశించారు. ఆయా పనుల ను ఆమోదించి నిధులు మంజూరు చేస్తే వచ్చే వేసవిలోగా పనులు పూర్తవుతాయ న్నారు. మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తున్న ’టేల్ టు హెడ్’ పద్ధతిన సాగునీటి పంపిణీని ప్రయోగాత్మకంగా కొన్ని డిస్ట్రిబ్యూటరీలు, లేదా మైనర్ కెనాల్‌లలో అమలు చేయాలని మంత్రి కోరారు. ఈ విధానం వల్ల ఆయకట్టు చివరి రైతులకు నీరందకుండా పోయే సమస్యలు రావన్నారు. రబీ కార్యాచరణపై త్వరలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తానన్నారు. నీటి లభ్యతపై రైతులకు సరైన సమాచారం ముందుగానే ఇవ్వాలని, ఏ పొలం కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయ తీల ఆఫీసుల నోటీసు బోర్డులపై తప్పని సరిగా ఆ ప్రాంతానికి చెందిన జేఈ పేరు, మొబైల్ ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది చివరికల్లా ఎల్‌ఎండీకి నీరు
2017 డిసెంబర్ కల్లా మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీరందిస్తామని మంత్రి హరీశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఎండీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దుతో రైతులు భూములిచ్చేందుకు ముందుకు వస్తారని, ప్రభుత్వం వైట్ మనీ ఇస్తుంది కనుక భూసేకరణకు ఇప్పుడు అనువైన సమయమని మంత్రి అభిప్రాయపడ్డారు.