బయటికి వెళ్తున్నామంటే భుజాన బ్యాగ్ తప్పక ఉండాల్సిందే. ఇక పార్టీలకు వెళ్లేపుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలంటే డ్రెస్‌తో పాటు ఆభరణాలు, వెంట తీసుకెళ్లే ఆక్ససరీస్ ట్రెండీగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆసియాకు చెందిన ఓ మహిళ కూడా తన వెంట తీసుకెళ్లే బ్యాగు ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. అయితే అందుకోసం ఆమె వెచ్చించిన సొమ్ము ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.
హాంగ్‌కాంగ్‌లో క్రిస్టీస్ అనే సంస్థ నిర్వహించిన వేలంలో 2కోట్ల 57లక్షల రూపాయలు చెల్లించి మరీ బ్యాగును ఆమె సొంతం చేసుకున్నారు. హ్యాండ్ బ్యాగుకే అంత ధరా అని ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది ప్రఖ్యాత ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ ‘హెర్మ్స్’కు చెందిన బిర్కిన్ బ్రాండ్ బ్యాగు. హ్యాండు బ్యాగుల తయారీ కోసం ప్రత్యేకంగా మొసళ్లను పెంచి మరీ వాటి చర్మంతో బ్యాగులు, పర్సులు తయారు చేసే హెర్మ్స్ కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. విక్టోరియా బెక్‌హామ్ నుంచి అమెరికన్ టీవీ నటి కిమ్ కర్దాషియన్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు తమ చేతిలో ప్రఖ్యాత హెర్మ్స్ బ్రాండ్ బ్యాగు ఉండాలని పోటీ పడి వాటిని సొంతం చేసుకుంటారు. బిర్కిన్ బ్యాగు ప్రారంభ ధర 7 వేల డాలర్లకు తక్కువగా ఉండదు.
ప్రస్తుతం ఆసియన్ మహిళ సొంతం చేసుకున్న బ్యాగును హిమాలయన్ నీలో మొసలి చర్మంతో తయారుచేశారు. అరుదైన 245.. 18 క్యారట్ వైట్ గోల్డ్ డైమండ్స్‌తో పొదగబడిన లాక్‌తో రూపొందిన గ్రేడియన్ కలర్ బ్యాగును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది ష్యాషన్ ప్రియులు పోటీ పడటంతో చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన బ్యాగుగా రికార్డుకెక్కిందని క్రిస్టీస్ నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment