ఒక మొసలి అనుహ్యంగా ఒక గ్రామంలోని రాత్రివేళ ఇంటిలోకి ప్రవేశించింది. ఎలా వచ్చిందో ఏమో గానీ దాని ఎంట్రీతో ఆ కటుంబం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ జాగారం చేస్తూ గడిపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఇటావాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని హర్మామ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం. ...రాత్రి 10.గంటల సమయంలో వాళ్ల అమ్మ అరుపుతో తన కుమార్తె గది తలుపు తెరిచింది. అంతే ఆ సమయంలో ఈ మొసలి లోపలికి వచ్చేసింది. అది ఎలా వచ్చిందో తమకు తెలియదని తమ మేకలు చప‍్పుడు చేయడంతో ఏదో జరిగినట్లు అనుమానం వచ్చిందని ఇంటి యజమాని చెబుతున్నాడు.
తీరా చూస్తే మొసలి దీంతో తాము భయపడి పోలీసులకు సమాచారం అందిచామని చెప్పాడు. పోలీసులు స్థానికి వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ త్రిపాఠికి సమాచారం అందించారు. అతను ఇంటికి తాళం వేసి బయటకు వచ్చేసి ఉండమని చెప్పారు. దీంతో వారంతా అలానే చేసి రాత్రంతా జాగారం చేస్తూ ఇంటి బయటే కూర్చొన్నారు. ఈ వార్త ఆ గ్రామంలోని స్థానికులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో జనాలు సదరు యజమాని ఇంటి వద్ద గుమిగూడారు.
ఈ మేరకు పోలీసులు, డాక్టర్ త్రిపాఠి ఇక గంటపాటు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ఆ మొసలిని పట్టుకున్నారు. అనంతరం ఆ మొసలిని అటవీశాఖకు అప్పగించారు. ఐతే ఈ మొసలి పెద్దది కాదని బాల్యదశలో ఉందని చెప్పారు. రాత్రి సమయంలో ఈ మొసలి చాలా దూకుడుగా ఉంటుందని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించలేదని డాక్టర్ త్రిపాఠి చెప్పారు. పక్కనే ఉన్న కాలువ నుంచి రాత్రిపూటా ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment