మొసలి పొట్ట కోసి.. బాలుడ్ని బయటకు తీసి.. | Crocodile Stomach Split Out And Removed Boy From Stomach In Indonesia | Sakshi
Sakshi News home page

మొసలి పొట్ట కోసి.. బాలుడ్ని బయటకు తీసి..

Mar 6 2021 2:35 PM | Updated on Mar 6 2021 2:50 PM

Crocodile Stomach Split Out And Removed Boy From Stomach In Indonesia - Sakshi

మొసలి కడుపులోనుంచి బాలుడ్ని బయటకు తీస్తున్న దృశ్యం

అది బాలుడితో సహా నీళ్ల అడుగులోకి వెళ్లిపోయింది. నమలకుండానే బాలుడ్ని మింగేసింది..

జాకార్తా : 26 అడుగుల పొడవైన మొసలిని చంపి, దాని కడుపు కోసి అది మింగిన బాలుడ్ని బయటకు తీసిన ఘటన ఇండోనేషియాలో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియా, ఈస్ట్‌ కలిమన్‌తన్‌కు చెందిన దిమస్‌ ముల్కన్‌ సపుత్ర అనే ఎనిమిదేళ్ల బాలుడు బుధవారం తండ్రి సుబ్లియాన్షాతో కలిసి చేపలు పట్టడానికి దగ్గరలోని నదికి వెళ్లాడు. ఇద్దరూ చేపలు పడుతుండగా 26 అడుగుల ఓ పొడవైన మొసలి దిమస్‌పై దాడి చేసింది. అది గమనించిన సుబ్లియాన్షా మొసలిని కొట్టి కుమారుడ్ని కాపాడాలని చూశాడు. అయితే అది బాలుడితో సహా నీళ్ల అడుగులోకి వెళ్లిపోయింది.

మొసలి కడుపులోనుంచి బాలుడ్ని బయటకు తీస్తున్న దృశ్యం

నమలకుండానే బాలుడ్ని మింగేసింది. గురువారం గ్రామస్తులు మొసలిని చంపి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ‘దిమస్‌.. దిమస్‌’’ అంటూ అరవటం మొదలుపెట్టారు. అనంతరం దాని పొట్టను కోసి దిమస్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. బాధాతప్త హృదయాలతో కన్నీరు కార్చారు. దిమస్‌కు కన్నీటి వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి : వైరల్‌: చేప కడుపులో తాబేలు చక్కర్లు!

ఏడాదిగా మైనర్‌ బాలుడిపై అత్యాచారం చేస్తోన్న మహిళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement