మొసలి దాడిలో విలేకరి మృతి | Britan Journalist died in crocodile attack in Sri Lanka | Sakshi
Sakshi News home page

మొసలి దాడిలో విలేకరి మృతి

Published Fri, Sep 15 2017 8:59 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

Britan Journalist died in crocodile attack in Sri Lanka

కొలంబో: శ్రీలంకలో ఓ బ్రిటన్‌ జర్నలిస్ట్‌ పాల్‌ మెక్‌క్లీన్‌(24) మొసలిదాడిలో మృతి చెందాడు. దేశ రాజధాని కొలంబోకు 360 కిలో మీటర్ల దూరంలోని పనామా గ్రామ శివారులో ఉన్న ఓ బూరదగుంటలో  పడి ఉన్నాడు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆ ప్రాంతంలో ఎక్కువగా మొసళ్లు తిరుగుతుంటాయని అవే దాడి చేసి హతమార్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

 యూకేకు చెందిన పాల్ మెక్‌క్లీన్ బ్రిటీష్‌ మీడియా సంస్థ ఫైనాన్షియల్‌ టైమ్స్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. అతను తన మిత్రులలతో కలిసి శ్రీలంకలో పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement