
జైపూర్: ఈ జంతువును గుర్తు పట్టారా? అంటూ ఓ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లంతా ఇది ఏ జంతువో తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. రాజస్థాన్‌లో తీసిన ఈ ఫొటోను ఐఏఎస్ అధికారి సోనీ ఇటీవల తన ట్విటర్‌లో షేర్ చేశారు. దీనికి ‘ఈ ఫొటోలో ఉన్న జంతువును గుర్తుపట్టగలరా! ప్రకృతి అద్భుతమైనది, బాహుముఖ కళాఖండమని మీరు ఒప్పుకోక తప్పదు’ అంటూ ట్వీట్ చేశారు. (జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్)
So dear friends,
— Dr. JK Soni, IAS (@Jksoniias) June 25, 2020
Can you identify what is this in photo ??? 😊
You must appreciate that #Nature is the finest, biggest and most versatile artist.
Nature nurtures! pic.twitter.com/0JgFiLhfQU
ఫొటోలో ప్రింటేడ్ బెడ్‌షీట్‌తో కప్పబడినట్లు ఉండి రెండు కళ్లు బయటకు కనిపిస్తుండంతో అది గూడ్లగుబ అయుంటుందేమోనని నెటిజన్లంతా అభిప్రాయపడ్డారు. అయితే ‘అది గూడ్లగుబ కాదని క్రాప్ చేసిన మొసలి ఫొటో’ అంటూ ఆయన మరో ట్వీట్‌లో వెల్లడించారు. ‘‘ఈ ఫొటో రాజస్థాన్‌లోని కంబాల్ నది వద్ద తీసింది. అక్కడ 7 మొసళ్లు దాదాపు 1 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని, అందులో ఒక మొసలిని జూమ్ తీయగా ఇలా వచ్చింది’’ అని చెప్పారు. దీంతో నెటిజన్లు ‘ప్రకృతి నిజంగా అద్భుతమైనది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.