
‘అమూల్’య నివాళి
నూటయాభైకి పైగా సినిమాలలో నటించిన బాలీవుడ్ నట దిగ్గజం శశికపూర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మరణించిన సంగతి అందరికీ తెలుసు కదా! ఆయన మృతికి సంతాపంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా ఎందరో అధికార, అనధికార ప్రముఖులు, అమితాబ్ బచన్ వంటి గొప్ప నటులు, అభిమానులు ట్వీట్లు చేశారు. వీటన్నిటినీ అందరూ మామూలుగా చూశార ంతే! అయితే, అందరినీ ఆకట్టుకున్న ట్వీట్ ఏమిటో తెలుసా? అమూల్ కంపెనీ శశికపూర్ దీవారా చిత్రంలో ఎంతో భావోద్వేగంతో చెప్పిన మేరా పాస్ మా హై’ అన్న ఆల్‌టైమ్ పాపులర్ డైలాగ్‌ను ‘మేరే పాస్ ఆప్ కా సినిమా హై...’ అంటూ ఒక కార్టూన్‌ను పోస్ట్ చేసి ప్రేక్షకులు శశిని ఎప్పటికీ మరచిపోనివ్వకుండా చేసింది. అభిమానులు ఆ కార్టూన్‌ను ఎంతో అమూల్యంగా చూస్తూ, షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.
దింపుడు మొసలి
అక్రమంగా జంతువులను రవాణా చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు ఉప్పందింది. వెంటనే వారు అప్రమత్తం అయారు. చివరకి ఒకరి వద్దనున్న బాక్స్‌ను తెరిపించారు. ఆ తర్వాత ఆశ్చర్యంతో నోరువెళ్ల ట్టారు. ఎవరైనా పిల్లిని పెంచుకుంటారు, కుక్కను పెంచుకుంటారు, గినియా పిగ్స్‌ను పెంచుకునే వాళ్లనూ చూశాం కానీ, ఇలా మొసళ్లను పెంచుకునే వాళ్లను చూశామా? అని నోళ్లు నొక్కుకున్నారు.న్యూయార్క్‌లోని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బాక్స్‌ను ఓపెన్ చేయడం... అందులోనుంచి బయటపడ్డ సుమారు నాలుగడుగుల పొడవున్న మొసలి పిల్లను చూసి అధికారులు నోరుÐð ళ్లబెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్నట్టు ఎత్తుకు తగ్గ లావుతో స్లిమ్‌గా ఉన్న ఆ మొసలి పిల్లకు ఆఫీసర్లు ఆర్నాల్డ్ షార్జ్‌నిగ్గర్ అని నామకరణం చేసేశారు. ఒక మొసలి పిల్లని అక్రమంగా దిగుమతి చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సుఫోల్క్ దేశస్థులు ఇలా అక్రమంగా జంతువులను రవాణా చేస్తూ పట్టుబడటం కొత్తేమీ కాదు కానీ, ఇలా పెంపుడు మొసలిని తరలించడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు అధికారులు.
మీడియా టోర్నడోలు
సాధారణంగా వరదలు, తుపాన్లు, సునామీలు, అగ్నిప్రమాదాలు వంటì ప్రకృతి విపత్తులను ఎవరూ అపురూపంగా చూడరు. గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అయితే, ఈశాన్య ఇటలీలోని సన్రెమో అనే పట్టణంలో సంభవించిన ఒక టోర్నడో దృశ్యాలను అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. ఎందుకంటే, మందపాటి మబ్బుపొరను పదునైన దబ్బనంతో ఎవరో పొడిచినట్టుగా అందులోంచి గాలి, నీళ్లు దూసుకువచ్చి, సముద్రంపై ఫౌంటెన్‌లా నీటిని చిమ్ముతున్న దృశ్యాలు ఎవరికి మాత్రం వింతగా అనిపించవు మరి!నిజానికి అది భయంకరమైన తుఫానులా మారి, తీరప్రాంతాల్లోని పట్టణాలను, నగరాలను ముంచెత్తాలి. కానీ, అదృష్టవశాత్తూ మధ్యలోనే ఏ అదృశ్యశక్తో ఆపేసినట్టుగా సుడిగాలి, నీళ్లు పైనుంచి చిమ్మి అంతటితో సరిపెట్టింది. ఈ సంఘటన జరగడానికి ముందే తుపాను వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు బీచ్‌లోకి సందర్శకులను రానివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో పెద్దఎత్తున జన, ధననష్టం జరిగే ముప్పు తప్పింది. స్థానికులు ఆ దృశ్యాలను వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment