భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని దామో పట్టణంలో ఓ మొసలి జనావాసాల్లోకి రావడం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు దామో పట్టణం సమీపంలోని నది ఉప్పొంగడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొసలి రాకతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని పట్టుకున్నారు. అనంతరం దానిని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై దామో ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ పర్మ్‌లాల్ మాట్లాడుతూ.. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతోనే మొసలి పట్టణంలోకి ప్రవేశించిందని తెలిపారు. అది 10 ఫీట్లకు పైగా పొడవు ఉందని.. స్థానికులు, తమ సిబ్బంది సాయంతో దానిని జాగ్రత్తగా పట్టుకున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment