
బాల్కొండ : ముప్కాల్ మండలం నాగంపేట్ ఊర చెరువులో మొసలి ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు జంకు తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుం చి నీటి సరఫరా చేసే లక్ష్మీ కాలువ ద్వారా చెరువు నిండుతోంది. దీంతో చెరువులోకి లక్ష్మీకాలువ ద్వారా మొస లి వచ్చి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. అధికారులు మొసలిని పట్టుకోవాలని కోరుతున్నారు.