సర్‌ప్రైజ్.. ఇంట్లో మొసలి..
Published Sun, Jul 30 2017 2:40 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
చెరువుల్లో.. నదుల్లో మొసలిని చూసుంటాం.. దాన్ని చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుతుంది. అలాంటిది ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది..! భయంతో చస్తాం.! కానీ ఓ మొసలి ఇంట్లోకి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చింది. గుజరాత్‌లోని వడదోరాలో గత బుధవారం 4.5 అడుగులన్న ఓ మొసలి ఓ ఇంట్లోకి వచ్చింది. దానిని పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు అక్కడి కాలనీ వాసులు..
అయితే గత కొద్ది రోజులుగా గుజరాత్‌లో వరదలు ముంచెత్తడంతో నీరు ఇంట్లోకి చేరింది. ఈ కారణంగానే మొసలి ఇంట్లోకి చేరినట్లు కాలనీవాసులు భావిస్తున్నారు. ఈ వీడియోను ఏఎన్‌ఐ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. అధికారులు ఆ మొసలిని చెరువులో విడిచిపెట్టినట్లు తెలిపారు.
Advertisement
Advertisement