గజేంద్రమోక్షం: మొసలి-ఏనుగు హోరాహోరీ! | crocodile- elephant fight | Sakshi
Sakshi News home page

గజేంద్రమోక్షం: మొసలి-ఏనుగు హోరాహోరీ!

Published Mon, Apr 17 2017 6:39 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

గజేంద్రమోక్షం: మొసలి-ఏనుగు హోరాహోరీ!

గజేంద్రమోక్షం: మొసలి-ఏనుగు హోరాహోరీ!

మడుగులో దిగిన ఏనుగు మొసలి బారిన పడటం.. మొసలి నోట చిక్కిన గజేంద్రుడిని ఆ శ్రీమహా విష్ణుమూర్తి కాపాడటం.. ఇదంతా తెలుగువారికి సుపరిచితమే. పోతనామాత్యుడు రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షలాంటి ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ మడుగులో నీటిని తాగేందుకు గజేంద్రుల గుంపు వెళ్లింది. అక్కడ ఓ చిన్ని ఏనుగు నీళ్లు తాగుతుండగా.. మడుగులో గుట్టుగా మాటు వేసిన మొసలి.. దాని తొండాన్ని నోట కరుచుకుంది.

అంతే ఇద్దరి మధ్య జీవర్మరణ పోరాటమే తలపించింది. మొసలి నోట తొండం చిక్కిన ఏనుగు మొదట గట్టిగానే ప్రతిఘటించింది. మొసలిని తొండంతో ఇటు-అటు కొట్టి ఓడ్డుకు ఈడ్చే ప్రయత్నం చేసింది. తోటి ఏనుగులు మొదట భయపడినా.. ఆ తర్వాత సాయం చేయడంతో మొసలి తొకముడవక తప్పలేదు. ఈ ఘటన మలావిలోని లివోండే జాతీయ పార్కులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అలెగ్జాండర్‌ మాకెంగ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పెట్టగా.. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement