హల్‌చల్‌ చేసిన భారీ మొసలి | Big Crocodile Spotted in Mahadevpur Forest | Sakshi
Sakshi News home page

హల్‌చల్‌ చేసిన భారీ మొసలి

Published Sun, Jan 5 2020 7:50 PM | Last Updated on Sun, Jan 5 2020 8:02 PM

Big Crocodile Spotted in Mahadevpur Forest - Sakshi

సాక్షి, మహాదేవపూర్‌: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలంలో ఓ భారీ మొసలి హల్‌చల్ చేసింది. వ్యవసాయపనులకు వెళుతున్న రైతులు మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలివి.. మహాదేవపూర్ మండలం పల్గుల అటవీ ప్రాంతంలోకి ఓ భారీ మొసలి వచ్చింది. మొసలి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా స్థానికులు గుర్తించి.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అతి కష్టం మీద మొసలిని బంధించి.. శివ్వారం మొసళ్ళ సంరక్షణ కేంద్రంలో వదిలారు. ఇటీవలి వర్షాలకు అన్నారం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో మొసలి కొట్టుకువచ్చినట్టు భావిస్తున్నారు. భారీగా ఉన్న మొసలిని చూసి స్థానికులు, రైతులు భయోందోళనకు గురయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement