Mahadevpur forest
-
Timber Smuggling: కలపకు కాళ్లు ! .. నదుల మీదుగా
ఒకప్పుడు దండకారణ్యంగా ఉన్న మహదేవపూర్ అడవులు ప్రస్తుతం పలుచబడ్డాయి. కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న కలప రవాణా మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు కలప అక్రమంగా తరలివస్తుంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో కలపకు కాళ్లు వచ్చాయనే చందంగా తయారైంది. ఆయా రాష్ట్రాల నుంచి విలువైన వృక్ష సంపద కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం వంతెనల మీదుగా తెలంగాణలోని భూపాలపల్లి, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల పట్టణాలకు యథేచ్ఛగా తరలిపోతున్నట్లు తెలిసింది. రూ.లక్షల్లో వ్యాపారం సాగుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. కానీ ఎక్కడా అటవీశాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో అక్కమార్కులకు ఆడిందే ఆట పాడిండే పాటగా తయారైందని విమర్శలు ఉన్నాయి. – కాళేశ్వరం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విలువైన టేకు వృక్ష సంపద అపారంగా ఉంది. కానీ అక్కడ విలువ తక్కువగా ఉండడంతో అక్రమార్కులు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల సరిహద్దుల నుంచి కలప వ్యాపారం జోరుగా చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన మీదుగా రాత్రి వేళల్లో కలప తరలివస్తుంది. అవతలి వైపు సిరొంచ వద్ద మహారాష్ట్ర చెక్‌పోస్టు ఉంది. అక్కడి సిబ్బందిని మచ్చిక చేసుకొని కలపను టాటా ఏసీ, వ్యాను, లారీల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ మీదుగా కలప తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు వంతెనలు దాటి అన్నారం బ్యారేజీ మీదుగా కలప పట్టణాలకు తరలిపోతుంది. కానీ ఎక్కడా ఈ మూడు వంతెనల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం రూ.లక్షల విలువైన టేకు తరలిపోతుందని తెలిసింది. రాత్రి వేళల్లో నిఘా తగ్గడంతో.. ఇలా కలప వ్యాపారం జరుగుతున్నా అధికారులు అటువైపు చూడడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సిరొంచ వద్ద తెలంగాణలోని కొంత మంది స్మగ్లర్లు కొన్ని సందర్భాల్లో టాటా ఏసీ వాహనాల్లో తరలిస్తూ లక్షల విలువైన కలపతో అక్కడి అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణం.. తెలంగాణ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. దానికి అనుగుణంగా గృహాల యజమానులు కలపను కొనుగోలు చేస్తున్నారు. కలప స్మగ్లర్లు రూ. 5–6వేల వరకు 6 ఫీట్ల పొడవు, ఆరు ఇంచుల వెడల్పు గల (దుంగ) కలపకు తీసుకొంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో రూ.2500–3200 వరకు కొనుగోలు చేస్తూ దండుకుంటున్నారు. ఇళ్లలో దర్వాజలు, తలుపులు, కిటికీలతో పాటు ఇంటికి సంబంధించి ఫర్నిచర్ కోసం కలపను తరలిస్తున్నారు. మహదేవపూర్, పలిమెల మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగరీత్యా పనిచేసి బదిలీ అయ్యే సందర్భంలో కూడా లక్షల విలువైన పర్నిచర్‌ను తయారు చేయించుకొని అనుమతులు లేకుండా తరలిపోతున్నారు. వారిపైన కూడా నిఘా లేదని తెలిసింది. అటవీశాఖ అధికారులు మాత్రం కలపను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. వంతెనల వద్ద చెక్‌పోస్టుల ఏర్పాటులో జాప్యం ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదని సామాన్య ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయమై మహదేవపూర్ ఎఫ్డీఓ వజ్రారెడ్డిని ఫోన్లో సంప్రదించగా.. మా రేంజ్ పరిధిలో అటవీశాఖ సిబ్బంది లేరన్నారు. చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని పై అధికారులకు నివేదిక పంపాం. మహారాష్ట్ర నుంచి కలప వస్తే మా సిబ్బంది పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. నదుల మీదుగా.. అప్పుడప్పుడు వంతెనల నుంచి కాకుండా అధికారులను రూటు మార్చేందుకు గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల మీదుగా టేకు తెప్పలుగా కట్టి తరలిస్తున్నారు. ఇలా తెప్పల ద్వారా తెచ్చిన కలపను పలిమెల, మహదేవపూర్, కాళేశ్వరం మండలాల నుంచి, అటు ఏటూరునాగారం మీదుగా కూడా ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తనిఖీల్లో దొరికేటివి కొన్ని మాత్రమే.. విలువైన టేకు మాత్రం అధికారుల కళ్లు గప్పి అందకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. -
హల్చల్ చేసిన భారీ మొసలి
సాక్షి, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ఓ భారీ మొసలి హల్చల్ చేసింది. వ్యవసాయపనులకు వెళుతున్న రైతులు మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలివి.. మహాదేవపూర్ మండలం పల్గుల అటవీ ప్రాంతంలోకి ఓ భారీ మొసలి వచ్చింది. మొసలి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా స్థానికులు గుర్తించి.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అతి కష్టం మీద మొసలిని బంధించి.. శివ్వారం మొసళ్ళ సంరక్షణ కేంద్రంలో వదిలారు. ఇటీవలి వర్షాలకు అన్నారం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో మొసలి కొట్టుకువచ్చినట్టు భావిస్తున్నారు. భారీగా ఉన్న మొసలిని చూసి స్థానికులు, రైతులు భయోందోళనకు గురయ్యారు. -
హల్చల్ చేసిన భారీ మొసలి
-
మూడు దుప్పులు మాయం!
► స్థానిక ముఠా సాయంతో తప్పించుకున్న వేటగాళ్లు ► అదృశ్యమైన జిప్సీ, టాప్‌లెస్ జీపులు ► ఓ వైపు చేజింగ్.. మరోవైపు ఎస్కేప్ ప్లాన్ ► వన్యప్రాణుల వేటలో అనుమానపు మలుపులు ► ఐదుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు సాక్షి, భూపాలపల్లి: మహదేవపూర్ అడవుల్లో గత ఆదివారం జరిగిన వన్యప్రాణుల (జింకలు) వేట ఘటనలో అనేక అనుమానపు మలుపులు కనిపిస్తున్నాయి. వేటకు తెగబడు తున్న ముఠా సభ్యుల్లో సగం మంది మహదేవపూర్– ఏటూరునాగారం అడవుల గుండా తప్పించుకుని హైదరాబాద్‌కు వెళ్లిన ట్లు తెలుస్తోంది. మొత్తం పద్నాలుగు మంది ఈ వేటలో పాల్గొనగా ఫారెస్టు అధికారులకు ఐదుగురు వేటగాళ్లు తారసపడ్డారు. వీరు ఫారెస్టు అధికారులపైకి తుపాకీ ఎక్కుపెట్టి వాహనాన్ని వదిలి పారిపోగా మిగిలిన సభ్యులు పలిమెల– ఏటూరునాగారం మీదు గా హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం..2017 మార్చి 19న హైదరాబాద్‌కు చెందిన నలుగురు వేటగాళ్లు మహదేవపూర్ చేరుకున్నారు. షికారు చేయడంలో పేరొందిన గోదావరి ఖనికి చెందిన ఓ వ్యక్తి వీరితో కలిశాడు. అనంతరం వన్యప్రాణుల వేటకు సహకరించే తొమ్మిది మందితో కూడిన స్థానిక ముఠా వీరికి తోడయింది. అనంతరం పద్నాలుగు మంది సభ్యులు టాటా ఇండికా, మారుతి స్విఫ్ట్, రెండు టాప్ లెస్ జీపులు మొత్తం నాలుగు వాహనాల్లో పలిమెల మండలం సర్వాయిపేట – దమ్మూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరు తొలుత సర్వాయిపేట– దమ్మూరు మధ్యలో గోదావరి నదిలో ఓ నీటి మడుగు వద్ద మాటు వేశారు. ఇక్కడకు దుప్పుల గుంపు రాగానే తుపా కులతో కాల్పులు జరపగా నాలుగు దుప్పులు చనిపోయాయి. వేటలో విజయానికి గుర్తుగా సర్వాయిపేటలో దావత్ చేసుకోవాలని తొలుత వేటగాళ్లు భావించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు తామ వెళ్లిపోతామని చెప్పి ఇండికా, టాప్‌లెస్ జీపులో మహదేవపూర్ వైపు ఐదుగురు వేటగాళ్లు పయనమైనట్లు సమాచారం. తూటాల మోతతో... హైదరాబాద్‌కు వెళ్లాల్సిన వేటగాళ్లు టాప్‌లెస్ జీపులో ఒక దుప్పిని ఎక్కించుకుని ఇండికాలో సర్వాయిపేట నుంచి మహదేవపూర్ వైపు వస్తుండగా పంకెన వాగు సమీపంలో మరో వన్యప్రాణుల గుంపు ఎదురైంది. మరోసారి కాల్పులు జరపగా ఇంకో ప్రాణి చనిపోయిం ది. పంకెన వాగు సమీపంలో రెండో సారి వేట సమయంలో పేల్చిన తుపాకీ శబ్దాలు విన్న సమీపంలోని ప్రజలు అటవీశాఖ అధికారుల కు సమాచారమిచ్చారు. ఫారెస్టు అధికారులు అంబట్పల్లి వద్ద వేటగాళ్లను అడ్డుకోగా తుపాకితో బెదిరించి పారిపోయారు. ఏటూరునాగారం మీదుగా... ఫారెస్టు అధికారుల దాడి విషయం తెలిసన వెంటనే సర్వాయిపేటలో దావత్లో ఉన్న వేటాగాళ్ల ముఠా నేత అప్రమత్తమయ్యాడు. పలిమెలలో ఉన్న వేటగాళ్లను, మూడు దుప్పు ల కళేబరాలను అక్కడే ఉన్న టాప్‌లెస్ జీపులో ఎక్కించి పలిమెల–సర్వాయిపేట– దమ్మూరు – నీలపల్లి – ముకునూరు – తుపాకుగూడెం– ఏటూరునాగారం మీదుగా హైదరాబాద్‌కు పారిపోవాలంటూ సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సూచనలకు అనుగుణంగా వేటగాళ్లు టాప్‌లెస్ జీపు, స్విఫ్ట్కారులలో తప్పించుకున్నట్లు సమాచారం. ఈ వేటలో మొత్తం ఐదు వన్యప్రాణులు మరణించగా కేవలం రెండింటినే అధికారికంగా ధ్రువీకరిం చారు. సంఘటన స్థలంలో టాటా ఇండికా విస్టా కారు, ఫైజల్ మహ్మద్ ఖాన్‌కు సంబం ధించిన ఆధార్‌కార్డు, రూ.10 లక్షల వరకు లావాదేవీలు జరిపే ఖాళీ చెక్కు, కత్తి లభించి నట్లు పోలీసు రికార్డుల్లో పేర్కొన్నారు.