మూడు దుప్పులు మాయం!
► స్థానిక ముఠా సాయంతో తప్పించుకున్న వేటగాళ్లు
► అదృశ్యమైన జిప్సీ, టాప్‌లెస్ జీపులు
► ఓ వైపు చేజింగ్.. మరోవైపు ఎస్కేప్ ప్లాన్
► వన్యప్రాణుల వేటలో అనుమానపు మలుపులు
► ఐదుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
సాక్షి, భూపాలపల్లి: మహదేవపూర్ అడవుల్లో గత ఆదివారం జరిగిన వన్యప్రాణుల (జింకలు) వేట ఘటనలో అనేక అనుమానపు మలుపులు కనిపిస్తున్నాయి. వేటకు తెగబడు తున్న ముఠా సభ్యుల్లో సగం మంది మహదేవపూర్– ఏటూరునాగారం అడవుల గుండా తప్పించుకుని హైదరాబాద్‌కు వెళ్లిన ట్లు తెలుస్తోంది. మొత్తం పద్నాలుగు మంది ఈ వేటలో పాల్గొనగా ఫారెస్టు అధికారులకు ఐదుగురు వేటగాళ్లు తారసపడ్డారు. వీరు ఫారెస్టు అధికారులపైకి తుపాకీ ఎక్కుపెట్టి వాహనాన్ని వదిలి పారిపోగా మిగిలిన సభ్యులు పలిమెల– ఏటూరునాగారం మీదు గా హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
స్థానికుల సమాచారం ప్రకారం..2017 మార్చి 19న హైదరాబాద్‌కు చెందిన నలుగురు వేటగాళ్లు మహదేవపూర్ చేరుకున్నారు. షికారు చేయడంలో పేరొందిన గోదావరి ఖనికి చెందిన ఓ వ్యక్తి వీరితో కలిశాడు. అనంతరం వన్యప్రాణుల వేటకు సహకరించే తొమ్మిది మందితో కూడిన స్థానిక ముఠా వీరికి తోడయింది. అనంతరం పద్నాలుగు మంది సభ్యులు టాటా ఇండికా, మారుతి స్విఫ్ట్, రెండు టాప్ లెస్ జీపులు మొత్తం నాలుగు వాహనాల్లో పలిమెల మండలం సర్వాయిపేట – దమ్మూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
వీరు తొలుత సర్వాయిపేట– దమ్మూరు మధ్యలో గోదావరి నదిలో ఓ నీటి మడుగు వద్ద మాటు వేశారు. ఇక్కడకు దుప్పుల గుంపు రాగానే తుపా కులతో కాల్పులు జరపగా నాలుగు దుప్పులు చనిపోయాయి. వేటలో విజయానికి గుర్తుగా సర్వాయిపేటలో దావత్ చేసుకోవాలని తొలుత వేటగాళ్లు భావించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు తామ వెళ్లిపోతామని చెప్పి ఇండికా, టాప్‌లెస్ జీపులో మహదేవపూర్ వైపు ఐదుగురు వేటగాళ్లు పయనమైనట్లు సమాచారం.
తూటాల మోతతో...
హైదరాబాద్‌కు వెళ్లాల్సిన వేటగాళ్లు టాప్‌లెస్ జీపులో ఒక దుప్పిని ఎక్కించుకుని ఇండికాలో సర్వాయిపేట నుంచి మహదేవపూర్ వైపు వస్తుండగా పంకెన వాగు సమీపంలో మరో వన్యప్రాణుల గుంపు ఎదురైంది. మరోసారి కాల్పులు జరపగా ఇంకో ప్రాణి చనిపోయిం ది. పంకెన వాగు సమీపంలో రెండో సారి వేట సమయంలో పేల్చిన తుపాకీ శబ్దాలు విన్న సమీపంలోని ప్రజలు అటవీశాఖ అధికారుల కు సమాచారమిచ్చారు. ఫారెస్టు అధికారులు అంబట్‌పల్లి వద్ద వేటగాళ్లను అడ్డుకోగా తుపాకితో బెదిరించి పారిపోయారు.
ఏటూరునాగారం మీదుగా...
ఫారెస్టు అధికారుల దాడి విషయం తెలిసన వెంటనే సర్వాయిపేటలో దావత్‌లో ఉన్న వేటాగాళ్ల ముఠా నేత అప్రమత్తమయ్యాడు. పలిమెలలో ఉన్న వేటగాళ్లను, మూడు దుప్పు ల కళేబరాలను అక్కడే ఉన్న టాప్‌లెస్ జీపులో ఎక్కించి పలిమెల–సర్వాయిపేట– దమ్మూరు – నీలపల్లి – ముకునూరు – తుపాకుగూడెం– ఏటూరునాగారం మీదుగా హైదరాబాద్‌కు పారిపోవాలంటూ సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సూచనలకు అనుగుణంగా వేటగాళ్లు టాప్‌లెస్ జీపు, స్విఫ్ట్‌కారులలో తప్పించుకున్నట్లు సమాచారం. ఈ వేటలో మొత్తం ఐదు వన్యప్రాణులు మరణించగా కేవలం రెండింటినే అధికారికంగా ధ్రువీకరిం చారు. సంఘటన స్థలంలో టాటా ఇండికా విస్టా కారు, ఫైజల్ మహ్మద్ ఖాన్‌కు సంబం ధించిన ఆధార్‌కార్డు, రూ.10 లక్షల వరకు లావాదేవీలు జరిపే ఖాళీ చెక్కు, కత్తి లభించి నట్లు పోలీసు రికార్డుల్లో పేర్కొన్నారు.