ఏ విషయంలో ముందున్నా లేకున్నా... అన్ని జంతువులను సమభావంతో చూడటంలో చైనీయులు, తైవాన్‌వాసులు ఎప్పుడూ ముందుంటారు.. అందుకే తినే విషయంలో అదీ ఇదీ అని చూడరు. కనువిందుగా కనిపిస్తే చాలు.. ఏదైనా సరే.. నాలుగు రకాల మసాలాలు కుమ్మేసి.. ఆ నూడుల్స్‌తో కలిపేసి.. ఎంచక్కా మింగేస్తుంటారు.
తైవాన్‌కు చెందిన విచ్ క్యాట్ అనే రెస్టారెంటోడికి కూడా ఓ మొసలి ఇలాగే కనిపించినట్లుంది. పైగా అక్కడి చెఫ్‌లకు క్రియేటివిటీ కూడా కాసింత ఎక్కువేనట. అందుకే ఎప్పుడూ చికెన్ లెగ్గుపీసులేనా.. మనిసన్నాక కూసింత కళాపోసన ఉండాలని చెప్పి.. మొసలి లెగ్గు పీసుతో ఇదిగో ఈ వంటకాన్ని సిద్ధం చేసేశారు. దీన్ని రుచి చూస్తే. రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయట. అయితే.. రెస్టారెంట్‌కు వచ్చినోళ్లంతా.. ఫొటోలు తీసుకుంటున్నారు తప్పిస్తే.. దీన్ని ట్రై చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. మరి.. ఆ ధైర్యం మీకుందా?
Comments
Please login to add a commentAdd a comment