సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలమైంది. జంట నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాలాలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వరద నీరు ముచెత్తింది. పాతబస్తీ ప్రాంతం నీట మునిగింది. పాల్లె చెరువు పూర్తిగా నిండిపోడంతో పాతబస్తీని వరదలు ముంచెత్తాయి. రోడ్ల వెంట పారుతున్న నీటి ప్రవాహం వాగులను తలపిస్తోంది. ఈక్రమంలోనే ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు హైదరాబాద్‌లో భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడుదామనుకుని ప్రత్నించినా ఫలితం లేకపోయింది. గల్లంతైన వ్యక్తి వివరాలుతెలియాల్సి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా, గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.
దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జి
భారీ వర్షాలు, వరదలతో మూసారాంబాగ్ బ్రిడ్జి దెబ్బతింది. రెండు వైపులా ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్ మూసారాం ప్రాంతాన్ని సందర్శించారు. బ్రిడ్జి దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదాల నివారణకు రెండు వైపులా బారికేడింగ్, పోలీస్
బందోబస్త్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
(వరద బీభత్సం: తెలంగాణలో 2 రోజుల సెలవు)
Comments
Please login to add a commentAdd a comment