
కరీంనగర్‌టౌన్: తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘ఏయ్ బండి సంజయ్.. పాతబస్తీలో సభ పెట్టాలనే ఆలోచన విరమించుకోకుంటే నీ భార్య తల నరికి నీకు గిఫ్ట్‌గా ఇస్తాం. నీ ఇద్దరు కొడుకులను కిడ్నాప్ చేస్తాం..’అంటూ బెదిరించారు. అయినా వెనుకంజ వేయకుండా పాతబస్తీలో సభ పెట్టిన చరిత్ర మాది’అని సంజయ్ పేర్కొ న్నారు.
ఆదివారం కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్స్‌లో జరిగిన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్ ఎంపీగా తాను గెలిచానంటే అది కార్యకర్తలతోనేనని అన్నారు. ప్రజలు ఎంపీగా గెలిపించారు కాబట్టే తెలంగాణ అంతా తిరిగి పేదల పక్షాన పోరాడానని, ఫాంహౌస్‌కు పరి మితమైన కేసీఆర్‌ను ధర్నా చౌక్‌కు గుంజుకొచ్చానని పేర్కొ న్నారు.
కాగా, ధర్మం కోసమే పోరాడే మరో నాయకుడు రాజాసింగ్ ఏడాదిపాటు బీజేపీకి దూరమైనా.. చంపుతామని కొందరు బెదిరించినా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టలేదని సంజయ్ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్. విఠల్, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment