
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. చిన్న పిల్లాడనే కనికరం కూడా లేకుండా ఒక మహిళ 3ఏళ్ల బాలుడిని భవనం పైనుంచి కిందకు విసిరేసి హతమార్చింది. వివరాలు.. పాతబస్తీ పరిధిలోని భవాని నగర్‌కు చెందిన ఆయేషాకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది.ఈ నేపథ్యంలో మంగళవారం తన మేనల్లుడిని ఇంటికి తీసుకువచ్చింది. కాసేపటికే ఆ బాలుడిని భవనంపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు విసిరేయడంతో మృతి చెందాడు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయేషాను అదుపులోకి తీసుకున్నారు. కాగా బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అయేషాకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సంతానం లేకపోవడంతో మానసిక ఒత్తిడికి లోనై ఈ పని చేసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చదవండి:
దారుణం: తల చెరువులో.. మొండెం చెట్ల పొదల్లో
Comments
Please login to add a commentAdd a comment