చార్మినార్: పాతబస్తీలోని రంజాన్ మార్కెట్‌లో నిత్యం సందడి కనిపిస్తోంది. వస్తువులను అతి తక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. తక్కువ లాభంతో ఎక్కువ విక్రయాలు చేపడితే నష్టం ఉండదంటున్నారు ఇక్కడి వ్యాపారులు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి.
రంజాన్ మాసంలోని చివరి ఘట్టమైన జుమ్మత్ ఉల్ విదా పూర్తి కావడంతో ముస్లింలు ఇక ఈద్–ఉల్–ఫితర్ పండగ కోసం సిద్ధమవుతున్నారు. పండగకు ఇంకా ఒకరోజే మిగిలి ఉండటంతో పాతబస్తీలో ఎటుచూసినా రంజాన్ పండగ సంతోషం కనిపిస్తోంది. నైట్ బజార్ అర్ధరాత్రి దాటిన తర్వాత 2–3 గంటల వరకు కూడా కొనసాగుతోంది.
(చదవండి: ఉన్నత విద్యలోనూ ఉత్తర, దక్షిణాలే! )
Comments
Please login to add a commentAdd a comment