సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం సృష్టిస్తోంది. బిర్యానీ విషయంలో ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఎన్ని గంటల వరకు హోటల్ తెరచి ఉంచాలో చెప్పాలని అడిగారు. దీంతో మహమూద్ అలీ స్పందిస్తూ.. నేను హోంమంత్రిని.. నాకు వంద టెన్షన్లు ఉంటాయంటూ అర్ధరాత్రి ఫోన్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం ఎంఐఎం నేతలు ఇప్పటికే హైదరాబాద్ సీపీని కలిసిన విషయం తెలిసిందే. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి ఉందని ఎంఐఎం నేతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment