సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ వృద్ధుల ఆసరా పెన్షన్‌ల పథకంలో కుంభకోణానికి పాల్పడిన ముఠాలోని నలుగురిని సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కాంపై హైదరాబాద్ కలెక్టర్ మానిక్ రాజు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళఙతే... పాత బస్తీకి చెందిన 250మంది ఆసరా పెన్షన్‌లను ఈ ముఠా మూడు నెలల నుండి డైవర్ట్ చేస్తున్నట్లు కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముఠాలో కీలక పాత్రధారి, ప్రభుత్వ ఉద్యోగి అయిన ఇమ్రాన్ సోహెల్ అస్లాం సహాయంతో ఎమ్మార్వో పాస్‌వర్డ్‌తో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కోన్నారు. కాగా 2017లో కూడా అస్లాం పెన్షన్‌ల స్కాంకు పాల్పడటంతో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment