పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తాం: సంజయ్‌ | GHMC Elections 2020 Surgical Strike In Old City Bandi Sanjay | Sakshi
Sakshi News home page

సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్

Published Tue, Nov 24 2020 1:40 PM | Last Updated on Tue, Nov 24 2020 6:02 PM

GHMC Elections 2020 Surgical Strike In Old City Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వివాదాస్పద ప్రసంగం చేశారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. (గ్రేటర్‌ పోరు.. రంగంలోకి అమిత్‌ షా)

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ.. ‘1948లో హైదరాబాద్‌ను పాకిస్తాన్లో కలపాలని ఎంఐఎం కోరింది. బిహార్ ఎన్నికల్లో గెలిచిన ఎంఐఎం ఎమ్మెల్యే.. హిందుస్తాన్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్.. పాత బస్తీలో ఓట్ కట్టారు పార్టీగా మారింది. ఢిల్లీ మున్సిపాలిటీలో 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. బీజేపీ గెలిచిన చోట ఎక్కడా మతవిద్వేషాలు లేవు. బీజేపీ చెప్పింది చేస్తుంది. హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుంది. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదు’ అని అన్నారు. (బీజేపీ ముందు పవన్‌ కీలక ప్రతిపాదన!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement