
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్‌ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కాగా, బండి సంజయ్ బుధవారం కరీంనగర్‌లో టీటీడీ ఆలయ భూమిపూజకు హాజరయ్యారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అంటకాగే పార్టీ ఎంఐఎం. పాతబస్తీని ఎందుకు ఎంఐఎం అభివృద్ధి చేయలేకపోయింది. ఇప్పటి వరకు ఒవైసీ కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయి. దమ్ముంటే ఎంఐఎం అన్ని చోట్లా పోటీ చేయాలి. డిపాజిట్ కూడా రాదు. నరికి చంపుతామన్న ఎంఐఎం నాయకుల మాటలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ స్టీరింగ్ మా చేతుల్లో ఉందనడం హాస్యాస్పదమన్నారు. మేము అడిగిన ఒక్క పని కూడా బీఆర్‌ఎస్ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ఈటల Vs విజయశాంతి: ట్విట్టర్‌లో పొలిటికల్ పంచాయితీ..
Comments
Please login to add a commentAdd a comment