![Hyderabad Is The Center Of Huge Cyber Crime: Auto Drivers Arrested](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/25/Hyderabad-Is-The-Center-Of-.jpg.webp?itok=Aq114IOh)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో బ్యాంకును బురిడీ కొట్టించి రూ.175 కోట్లు కొల్లగొట్టారు. సైబర్ నేరగాళ్లకు ఇద్దరు ఆటో డ్రైవర్లు సహకరించారు. జాతీయ బ్యాంక్‌లో 6 బ్యాంక్ అకౌంట్లను ఆటో డ్రైవర్లు ఓపెన్ చేశారు. వారి ద్వారా రూ. 175 కోట్ల లావాదేవీలు సైబర్ కేటుగాళ్లు జరిపారు.
హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు నిధులు బదిలీ చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు ట్రాన్స్‌ఫర్ చేసిన ఆటో డ్రైవర్లు.. బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారు.
హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపారు. 600 కంపెనీలకు అకౌంట్లను సైబర్ నేరగాళ్లు లింక్ చేశారు. సైబర్ నేరగాళ్ల డబ్బులకు ఆశపడి ఆటోడ్రైవర్లు అకౌంట్లు తెరిచారు. సైబర్ నేరగాళ్ల వెనుక చైనా కేటుగాళ్ల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు ఆటో డ్రైవర్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment