
సాక్షి, హైదారబాద్: పాతబస్తీలో కారు బీభత్సం సృష్టించింది. మిశ్రీగంజ్‌లో ఇంటి ముందు కూర్చోని ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా రివర్స్‌లో వారిపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. కాగా కారును మహిళ డ్రైవ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమె ఇటీవలే యూఏఈ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment