
సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్ సమయంలో నగరంలోని పాతబస్తీలో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. స్థానిక భవానీ నగర్‌లో కొంతమంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగారు. ఆ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. రాళ్లు పెద్ద ఎత్తున రువ్వకోవడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న కొంతమంది యువకులను భవానీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (కరోనా కలవరం : వీడని విషాదం)
స్థానికల సమాచారం ప్రకారం బైక్ పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవకు కారణమైన వారిపై కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment