ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు వేధింపులకు గురిచేయడమే కాకుండా కిడ్నాప్‌కు యత్నించడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... చావ వినయ్ చౌదరి అనే యువకుడు కొంత కాలం క్రితం యువతితో సహజీవనం చేశాడు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు వినయ్ చౌదరి అక్రమంగా బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె ఫోన్‌ను పగలగొట్టాడు.
అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. బలవంతంగా ఆమెను బయటికి ఈడ్చుకొచ్చి కారులోకి తోసి కిడ్నాప్‌కు యత్నించగా ఆమె అరుపులకు ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారు బయటికు వచ్చి నిందితుడిని పట్టుకునేందుకు యత్నించి బాధితురాలిని కాపాడారు. అదే సమయంలో వినయ్ చౌదరి అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు వినయ్ చౌదరిపై ఐపీసీ సెక్షన్ 448, 354, 427,506 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment