
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గోపన్‌పల్లి తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్(25) నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి తండా సమీపంలో నివాసం ఉంటుంది. ఇక, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేష్ అనే యువకుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే, కొద్దిరోజులుగా రాకేష్.. దీపన వెంటపడుతూ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేశాడు. రాకేష్ ప్రపోజల్‌ను ఆమె నిరాకరించడంతో దీపనపై కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్.. ఆవేశంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న దీపన స్నేహితులు.. రాకేష్‌ను అడ్డుకోబోతుండగా వారిపైనా దాడికి పాల్పడ్డాడు. రాకేష్ దాడిలో దీపన మృతిచెందగా.. ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత రాకేష్ అక్కడి నుంచి పారిపోయాడు. మొయినాబాద్ సమీపంలో విద్యుత్ స్థంభం ఎక్కి కరెంట్ తీగలు పట్టుకుని రాకేష్ ఆత్మహత్యకు పాల్పడగా.. స్థానికులు గుర్తించి అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కసు నమోదు చేసుకున్న పోలసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment